
ప్రముఖ కవి గోరటి వెంకన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన వెంకన్నను సీజేఐ అభినందించారు. అనంతరం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య ఆకాడమీ అవార్డు అందుకున్నారు.
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను ప్రముఖ కవి గోరటి వెంకన్న మర్యాద పూర్వకంగా కలిశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా సీజేఐని కలిశారు. వల్లంకి తాళం కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన గోరటిని సీజేఐ అభినందించారు. శాలువాతో సత్కరించారు. సీజేఐకి వల్లంకి తాళం కవితా సంపుటిని గొరటి వెంకన్న బహుకరించారు. సీజేఐ అభ్యర్థన మేరకు అడవి తల్లిపై పాట పాడి వినిపించారు.
కాగా.. ఇటీవల గోరటి వెంకన్నకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర కంబరా గోరటి వెంకన్నకు అవార్డు ప్రదానం చేశారు. గోరటి వెంకన్న రచించిన వల్లంకి తాళం కవిత సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. సాహిత్య అకాడమీ అవార్డు రావడం సంతోషంగా ఉందని అవార్డు అందుకున్న గోరటి వెంకన్న అన్నారు.
గతంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ద్వారా జస్టిస్ ఎన్వీ రమణ చేతులమీదుగా అవార్డు కూడా తీసుకున్నానని ఈరోజు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో ఉండి వారు నన్ను పిలిచి అభినందించటం మాటల్లో చెప్పలేనిది అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.