తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త... ఆర్థిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Arun Kumar P   | Asianet News
Published : Oct 24, 2020, 10:47 AM IST
తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త... ఆర్థిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

సారాంశం

 దసరా పండగ తర్వాతి రోజు కూడా సెలవు ప్రకటించాలన్న ఉద్యోగుల అభ్యర్ధనను సీఎం అంగీకరించారు. 

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వెంటనే ఉద్యోగులకు 2019 జూలై నుండి రావాల్సిన కరువు భత్యం(డీఏ) వెంటను చెల్లించాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. డిఏపై నిర్ణయాధికారం కేంద్రానికి వుండటం వల్లే ఉద్యోగులు నష్టపోతున్నారని కేసీఆర్ ఆరోపించారు. 

ప్రస్తుతం డీఏను కేంద్రం నిర్ణయిస్తుండగా రాష్ట్రాలు వాటిని ఉద్యోగులకు చెల్లించే విధానం వుందని... ఇది కరెక్ట్ కాదని సీఎం అన్నారు. ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం వుందని...డీఏను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే వుండాలన్నారు. కేంద్రం అలసత్వం వల్ల ఇప్పటికే మూడు డీఏలు చెల్లించాల్సి వుందని... అందులో రెండింటిపై ఇంకా నిర్ణయమే తీసుకోలేదని మండిపడ్డారు. 

ఇక దసరా పండగ తర్వాతి రోజు కూడా సెలవు ప్రకటించాలన్న ఉద్యోగుల అభ్యర్ధనను సీఎం అంగీకరించారు. ఈ ఏడాది ఒక్కసారే కాదు ప్రతి ఏడాది దసరా పండగ తర్వాతి రోజు కూడా సెలవు వుండేలా షెడ్యూల్ రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్