హైద్రాబాద్ కోఠిలోని గోకుల్ చాట్ యజమానికి కరోనా సోకింది. దీంతో ఈ చాట్ దుకాణాన్ని అధికారులు మంగళవారం నాడు మూసివేశారు.
హైదరాబాద్: హైద్రాబాద్ కోఠిలోని గోకుల్ చాట్ యజమానికి కరోనా సోకింది. దీంతో ఈ చాట్ దుకాణాన్ని అధికారులు మంగళవారం నాడు మూసివేశారు.ఈ చాట్ దుకాణంలో పనిచేసే సుమారు 20 మందిని క్వారంటైన్ కి తరలించారు..
దుకాణాన్ని ఇవాళ మూసివేయించారు. అంతేకాదు దుకాణాన్ని శానిటేషన్ చేయనున్నారు. ప్రతి రోజూ వందలాది మంది ఈ చాట్ సెంటర్ కు వస్తుంటారు. రెండు రోజులుగా ఎవరెవరు ఇక్కడికి వచ్చి తినుబండారాలను కొనుగోలు చేశారనే విషయమై కూడా అధఘికారులు ఆరా తీస్తున్నారు.వీరికి కూడ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
also read:హైద్రాబాద్‌లో కరోనాతో హొంగార్డు ఆశోక్ మృతి
జూన్ 8వ తేదీ నుంచి గోకుల్ చాట్ పనిచేస్తోంది. హైద్రాబాద్ లో గోకుల్ చాట్ బాగా ప్రసిద్ది చెందింది. దుకాణం యజమానికి కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే అధికారులు ఈ దుకాణాన్ని పరిశీలించారు. శానిటేషన్ చర్యలకు చేపట్టారు. తెలంగాణలో సోోమవారం నాటికి కరోనా కేసులు 5193కి చేరుకొన్నాయి. కరోనాతో హొంగార్డు ఆశోక్ ఇవాళ హైద్రాబాద్ లో మరణించాడు.
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అందులోనూ హైదరాబాదులో కోవిడ్ -19 పాజిటివ్ తో అట్టుడుకుతోంది. తెలంగాణలో కరోనా వైరస్ కేసులు 5 వేలు దాటాయి. మొత్తం కేసుల సంఖ్య సోమవారంనాటి లెక్కల ప్రకారం 5,193కు చేరుకున్నాయి. సోమవారంనాడు ఒక్క రోజే హైదరాబాదులో 189 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.