భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తింది. ఇప్పటికే భధ్రాచలం వద్ద గోదావరి నది 61 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం, బూర్గుంపహాడ్ మండలాల్లో 144 సెక్షన్ విధించారు.
ఖమ్మం: Bhadrachalam వద్ద గోదావరికి వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం వద్ద Godavari నది 61 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం వాసులను అప్రమత్తం చేశారు. అధికారులు. భద్రాచలం రామాలయానికి సమీపంలోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎగువ నుండి 20 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్న నేపథ్యంలో సాయంత్రానికి మరింత వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం ఆయలం వద్ద ఉన్న నిత్య అన్నదాన సంత్రాన్ని మూసివేశారు. నిన్న సాయంత్రం నుండి ఈ సత్రాన్ని మూసివేశారు.
భద్రాచలం ఆలయానికి సమీపంలోని కరకట్ట వద్ద ఏడు మోటార్లను ఏర్పాటు చేసి వరద నీటిని గోదావరిలోకి పంపింగ్ చేస్తున్నారు. కానీ ఏ మాత్రం వరద తగ్గడం లేదు. ఆలయానికి చుట్టూ ఉన్నవారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పటికే చర్ల,దుమ్ముగూడెం మండలాల్లో పలు గ్రామాలు నీట మునిగాయి.
undefined
ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతంలోని సుమారు 5 వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలానికి వచ్చే రెండు వైపులా రోడ్డు మార్గం గోదావరి నది నీటిలో మునిగింది.
ప్రస్తుతం కొత్తగూడం , సారపాక మీదుగా వచ్చే రోడ్డు మార్గం ద్వారా భద్రాచలానికి వచ్చే అవకాశం ఉంది. అయితే సాయంత్రానికి ఈ మార్గం కూడా వరద నీటిలో ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. గోదావరి నదికి 65 అడుగులు భధ్రాచలం వద్ద చేరితే సారపాక వద్ద రోడ్డు కూడా మునిగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే భద్రాచలం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి వెళ్లే రోడ్డు మార్గాలుగోదావరి వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో ఈ రోడ్లపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. గోదావరి వరద ఉన్న ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు.
also read:భద్రాచలం వద్ద టెన్షన్: 61 అడుగులకు చేరిన గోదావరి, 144 సెక్షన్ విధింపు
అదే జరిగితే భధ్రాచలానికి వచ్చే రోడ్డు మార్గాలు మూసుకుపోయినట్టే. ఆకాశ మార్గంలోనే భద్రాచలానికి రావాల్సిన అవసరం ఉంటుంది. భద్రాచలం, బూర్గుంపహాడ్ మండలాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దని అధికారులు కోరుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని కూడా అధికారులు ఆదేశించారు.
మరో వైపు భద్రాచలం వద్ద గోదావరిపై ఉన్న బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను కూడా నియంత్రించే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై అధికారుల నుండి స్పష్టత రావాల్సి ఉంది.ఇప్పటికే గోదావరికి 18 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరికి వచ్చి చేరుతుంది. గంట గంటకు వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. గోదావరికి భద్రాచలానికి 20 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాతో ఉన్నారు. ఇన్ ఫ్లో ను దృష్టిలో ఉంచుకొని అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భద్రాద్రి ఆలయానికి రెండు రోజులు ఎవరూ రావొద్దు: కలెక్టర్
గోదావరికి వరద పోటెత్తడంతో రెండు రోజులపాటు సీతారామస్వామి ఆలయానకి ఎవరూ కూడా రావొద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ కోరారు. గోదావరి నది కి భారీగా వరద నీరు రావడంతో రెండు రోజుల పాటు ఎవరూ రావొద్దని ఆయన కోరాు. రెండు రోజుల తర్వాత వరద తగ్్గే అవకాశం ఉన్నందున భక్తుల రాకపోకల విషయమై నిర్ణయం తీసుకొంటామని కలెక్టర్ చెప్పారు. భద్రచాలనాకి వచ్చే మార్గంలో గోదావరి వరద నీరు ముంచెత్తిన విషయాన్ని కూడా గకలెక్టర్ గుర్తు చేశారు.