మునుగోడులో బిజెపికి మద్దతుగా జనసేన కార్యకర్తలు.. తమ కండువాల మీద పవన్ కళ్యాణ్ ఫోటో ముద్రించి, చేతిలో కమలం పువ్వు గుర్తును పట్టుకుని ప్రచారం చేస్తున్నారు.
మునుగోడు : తెలంగాణ రాజకీయాల్లో ‘గాజు గ్లాసు’ గుర్తు గందరగోళాన్ని సృష్టిస్తోంది. గాజు గ్లాసు గుర్తు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన. మొన్నటి వరకు తెలంగాణలో జనసేన కార్యక్రమాలు ఎక్కువగా లేవు. తాజాగా ఇప్పుడు జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో పొత్తుతో తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగుతోంది జనసేన. జనసేన తరఫునుంచి కొన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. అందులో కోదాడ నుంచి మేకల సతీష్ రెడ్డి ఒకరు. జనసేన పార్టీ అధికారిక చిహ్నమైన గాజు గ్లాసు గుర్తుతో ఆయన పోటీలోకి దిగారు.
ఇక్కడే ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తెలంగాణ ఎన్నికల కమిషన్ మునుగోడు నియోజకవర్గంలోని స్వతంత్ర అభ్యర్థి అయిన అంతటి హరిప్రసాద్ గౌడ్ కు గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. దీంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలోని కోదాడ మినహ మిగతా నియోజకవర్గం లో బిజెపికి జనసేన మద్దతిస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పోటీలో లేడు. దీంతో ఎన్నికల సంఘం అతనికి గాజు గ్లాసు గుర్తును కేటాయించింది.
undefined
గులాబీ నేత గుండెల్లో గుబులు పుట్టిస్తున్న చపాతీ కర్ర, రోడ్డు రోలర్..
దీని మీద జనసేన నేతలు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గాజు గ్లాస్ గుర్తు చూడగానే పవన్ కళ్యాణ్ అభిమానులు తికమకపడి దానికే ఓటు వేయడం వల్ల తాము మద్దతు ఇచ్చే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు. మునుగోడులో బిజెపికి మద్దతుగా జనసేన కార్యకర్తలు.. తమ కండువాల మీద పవన్ కళ్యాణ్ ఫోటో ఓవైపు ముద్రించి, చేతిలో కమలం పువ్వు గుర్తును పట్టుకుని మరి ప్రచారం చేస్తున్నారు. ఈవీఎంలో గాజు గ్లాసు గుర్తును చూసి గందరగోళ పడవద్దు అంటూ.. ఓటర్లలో అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ చిన్న రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఓటర్లు ఈజీగా గుర్తించేలా, నిరక్షరాసులు కూడా తేలికగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు.వీటిలో.. నిత్యం ఉపయోగించే వస్తువులు, పరికరాలు, యంత్రాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రెషర్ కుక్కర్, కంప్యూటర్, లాప్ టాప్, గ్యాస్ స్టవ్, టీవీ రిమోట్, గ్యాస్ సిలిండర్, బంతి, ఆపిల్, కెమెరా, స్టెతస్కోప్, క్యారం బోర్డ్, కుట్టు మిషన్, ఐస్ క్రీమ్, టార్చ్ లైట్, పెట్రోల్ పంప్, కత్తెర, మైక్, పల్లకి, బ్యాట్, చెప్పులు, హాకీ స్టిక్, ఉంగరం, గాజులు, టూత్ పేస్ట్, పండ్ల బుట్ట, కుండలతో పాటు జనసేన గుర్తు గాజాగ్లాసును కూడా స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు.
తెలంగాణలో జనసేన నేరుగా పోటీకి దిగకపోయినప్పటికీ గాజు గ్లాసు గుర్తు వారినీ ఇరకాటంలో పెట్టనుంది. స్వతంత్రులుగా శేరిలింగంపల్లి, మహేశ్వరం నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న రాజమహేంద్ర కటారి, సుబ్రహ్మణ్య రాహుల్ లకు, కల్వకుర్తిలో ఎస్ యుసిఐ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది.