బావార్చి హోటల్ సీజ్: చెప్పినా డోంట్ కేర్

Published : Jan 07, 2019, 09:44 PM IST
బావార్చి హోటల్ సీజ్: చెప్పినా డోంట్ కేర్

సారాంశం

డిసెంబర్‌ 25కే నోటీసు సమయం గడిచినా హోటల్‌ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీంతో ఈ రోజు హోటల్‌ను సీజ్‌ చేసినట్లు ఉమా ప్రకాష్ తెలిపారు.

హైదరాబాద్‌: హైదరాబాదు నగరంలోని ఆర్టీస్‌ క్రాస్‌ రోడ్డు బావార్చి హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్‌ చేశారు. ఆర్గానిక్‌ వేస్ట్‌ కన్వర్టర్‌ యంత్రాన్ని పెట్టుకోవాలని హోటల్‌ యజమాన్యానికి పలుమార్లు సూచించినా పట్టించుకోలేదని, నిరుడు నవంబర్‌ 25న నోటీసులు కూడా ఇచ్చామని హైదరాబాదు ముషీరాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ ఉమా ప్రకాష్‌ మీడియాకు తెలిపారు.

డిసెంబర్‌ 25కే నోటీసు సమయం గడిచినా హోటల్‌ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీంతో ఈ రోజు హోటల్‌ను సీజ్‌ చేసినట్లు ఉమా ప్రకాష్ తెలిపారు.  తడి, పొడి చెత్తలను వేరుచేయడంలేదని, జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా హోటళ్ల నిర్వాహకులు వ్యర్థపదార్థాలను మ్యాన్‌ హోల్‌లోకి వదులుతున్నారని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..
KTR Counter to Uttam Kumar Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు| Asianet News Telugu