రోడ్డుపై ఉమ్మేసిన ఆర్టీసీ డ్రైవర్.. జీహెచ్ఎంసీ షాక్

Published : Jul 03, 2019, 02:25 PM IST
రోడ్డుపై ఉమ్మేసిన ఆర్టీసీ డ్రైవర్.. జీహెచ్ఎంసీ షాక్

సారాంశం

ఆర్టీసీ బస్సు డ్రైవర్ కి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. రోడ్డుపై  ఉమ్మి వేసినందుకు జరిమానా విధించారు. 

ఆర్టీసీ బస్సు డ్రైవర్ కి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. రోడ్డుపై  ఉమ్మి వేసినందుకు జరిమానా విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే... కుషాయిగూడ బస్ డిపోకు చెందిన డ్రైవర్ జగదీష్... బస్సులో కూర్చొని రోడ్డుపై ఉమ్మి వేశాడు. దీంతో అప్పుడే రోడ్లను పరిశుభ్రం చేసిన జీహెచ్ఎంసీ కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. 

వెంటనే ఈ విషయంపై  ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు డ్రైవర్ జగదీష్‌కు జరిమానా విధించారు. వంద రూపాయల జరిమానా చెల్లించాలన్నారు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ లింగంపల్లిలో ఉన్నాడని తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి మరీ జరిమానా విధించడం గమనార్హం. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్
చైనా మంజాను ఎలా త‌యారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రాణాలు పోయేంత ప్ర‌మాదం ఎందుకు.?