సహాయం చేస్తానని నట్టేట ముంచింది

By telugu teamFirst Published Jul 3, 2019, 1:36 PM IST
Highlights

ఎన్ఆర్ఐ వృద్ధ దంపతులకు సహాయం చేస్తానని మాట ఇచ్చింది. బ్యాంకు రుణంలో సబ్సీడీ ఇప్పిస్తానని హామీ ఇచ్చింది. మాయ మాటలు చెప్పి ఆ ఎన్ఆర్ఐ దంపతుల వద్ద నుంచి రూ.61లక్షలు కాజేసింది. 

ఎన్ఆర్ఐ వృద్ధ దంపతులకు సహాయం చేస్తానని మాట ఇచ్చింది. బ్యాంకు రుణంలో సబ్సీడీ ఇప్పిస్తానని హామీ ఇచ్చింది. మాయ మాటలు చెప్పి ఆ ఎన్ఆర్ఐ దంపతుల వద్ద నుంచి రూ.61లక్షలు కాజేసింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్‌కు చెందిన నిఖిల (28) భర్త సందీ్‌పతో కలిసి 2016లో గాంధీనగర్‌లో నివాసముండేది. వీరు ఉంటున్న ఇంటికి సమీపంలోనే రాధాకృష్ణ (65), సుజాత దంపతులు ఉండేవారు. వీరి కుమారులు అమెరికాలో ఉండడంతో కొన్ని రోజులు అక్కడికెళ్లి వచ్చారు. 

నిఖిల వారికి చేదోడు వాదోడుగా ఉండేది. వారికి కావలసిన చిన్న చిన్న పనులు చేసి పెట్టేది. దీంతో వారు ఆమెను నమ్మారు. రాధాకృష్ణకు వ్యాపారంలో నష్టం రావడంతో యూనియన్‌ బ్యాంక్‌లో ఇల్లును తాకట్టు పెట్టి 1.65 కోట్ల రుణం తీసుకున్నారు. ప్రతి నెలా వాయిదాలు కట్టడంలో ఇబ్బందులు తలెత్తుతుండడంతో ఎవరైనా తెలిసిన వారు ఉంటే రుణం ఒన్‌టైం సెటిల్మెంట్‌ చేయించాలని నిఖిలను కోరారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆమె తన తమ్ముడు బ్యాంక్‌లో పని చేస్తాడని, అతని ద్వారా రుణాన్ని తగ్గించి ఒన్‌టైం సెటిల్మెంట్‌ చేయిస్తానని చెప్పింది.
 
   కొన్ని రోజుల తర్వాత బ్యాంక్‌ వారు రుణాన్ని రూ.82 లక్షలకు తగ్గించేందుకు అంగీకరించారని వాళ్లకు చెప్పింది. ఆమె మాటలు నమ్మిన వారు ఆబిడ్స్‌లోని తాజ్‌మహల్‌ హోటల్‌లో మొదటి విడతగా రూ.61 లక్షలను ఆన్‌లైన్‌ ద్వారా నిఖిల బ్యాంక్‌ ఖాతాలో వేశారు. ఆ డబ్బుతో నిఖిని జల్సాలు చేసింది. రోజులు గడుస్తున్నా బ్యాంక్‌ నుంచి సెటిల్మెంట్‌ లెటర్‌ రాకపోవడంతో వృద్ధ దంపతులు నిఖిలను నిలదీశారు. 

ఆమె ఎంతటికీ నిజం చెప్పకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు నిఖిలను అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి రూ.30వేల నగదు,  రూ.1.50లక్షల విలువచేసే బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

click me!