విద్యుత్ సరఫరాలో అంతరాయం: జనరేటర్ కోరుతూ కమిషనర్ కు జీహెచ్ఎంసీ మేయర్ ఫైల్

Published : Mar 05, 2021, 05:08 PM IST
విద్యుత్ సరఫరాలో అంతరాయం: జనరేటర్ కోరుతూ కమిషనర్ కు జీహెచ్ఎంసీ మేయర్ ఫైల్

సారాంశం

 తన కార్యాలయంలో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నందున జనరేటర్ ను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కమిషనర్ ను కోరారు.


హైదరాబాద్: తన కార్యాలయంలో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నందున జనరేటర్ ను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కమిషనర్ ను కోరారు.

తన కార్యాలయంలో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నందున తన విధులకు ఇబ్బందులు కలుగుతున్నాయని గద్వాల విజయలక్ష్మి చెప్పారు. తాను నిరంతరాయంగా విధులు నిర్వహించేందుకు గాను తన క్యాంప్ కార్యాలయంలో 25 కేవీ జనరేటర్ ను ఏర్పాటు చేయాలని కమిషనర్ కు ఆమె ఫైల్ పంపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేవని తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ పారిశ్రామిక వేత్తలు ఆందోళనలు నిర్వహించారు. కానీ జీహెచ్ఎంసీ మేయర్ విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా జనరేటర్ ఏర్పాటు చేయాలని కమిషనర్ ను కోరడం చర్చకు దారితీస్తోంది.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే