GHMC ExitPolls: బీజేపీ వెనకే, ఓట్ల శాతం తగ్గినా... కారుదే జోరు

By Siva KodatiFirst Published Dec 3, 2020, 6:43 PM IST
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఓల్డ్ మలక్ పేట రీపోలింగ్ ముగియడంతో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడుతున్నాయి. అన్ని సర్వేలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాయి. 

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఓల్డ్ మలక్ పేట రీపోలింగ్ ముగియడంతో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడుతున్నాయి. అన్ని సర్వేలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాయి.

గతంలో కంటే సీట్లు తగ్గినప్పటికీ.. టీఆర్‌ఎస్‌ సొంతంగానే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. అయితే గతంలో కంటే ఓట్ల శాతం మెరుగ్గా ఉన్నా సీట్లలో బీజేపీ వెనకబడే ఛాన్స్‌ ఉంది. ఎప్పటిలాగే ఎంఐఎం 40 కంటే ఎక్కువ సీట్లలో గెలవనుందని తేలింది.

‘పీపుల్స్‌ పల్స్‌’ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే ఫలితాల ప్రకారం.. టీఆర్‌ఎస్‌కు 68-78 స్థానాలు, బీజేపీకి 25-35, ఎంఐఎంకు 38-42 స్థానాలు, కాంగ్రెస్‌కు 1-5 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. 

ఆరా సర్వే: టీఆర్‌ఎస్‌ -78
పీపుల్స్‌ పల్స్‌ సర్వే: బీజేపీకి టీఆర్‌ఎస్‌ - 68 నుంచి 78
సీపీఎస్‌సర్వే: టీఆర్‌ఎస్‌ - 82 నుంచి 96
ఆత్మసాక్షి సర్వే: టీఆర్‌ఎస్‌ - 82 నుంచి 88
 

click me!