నేనెరుగ.. నేనెరుగ: బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి

Published : Nov 24, 2020, 07:50 PM IST
నేనెరుగ.. నేనెరుగ: బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి

సారాంశం

తమ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ పాతబస్తీ మీద చేసిన వ్యాఖ్యలపై మాట్లాడడానికి కిషన్ రెడ్డి నిరాకరించారు. బండి సంజయ్ ఏమన్నారో తనకు తెలియదని కిషన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: తాము మేయర్ పీఠంపై అధిష్టించిన వెంటనే హైదరాబాద్ పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని తమ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చంజయ్ చేసిన వ్యాఖ్యల గురించి తనకు తెలియదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు. బండి సంజయ్ ఏమన్నారో, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏం ట్వీట్ చేశారో తనకు తెలియదని ాయన చెప్పారు 

బండి సంజయ్ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి సమర్థిస్తున్నారా అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. దానిపై కిషన్ రెడ్డి స్పందిస్తూ పై విధంగా అన్నారు తాను బిజెపి కార్పోరేటర్ అభ్యర్థుల కోసం ప్రచారం ఉన్నట్లు ఆయన తెలిపారు. తాము దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామని, హైదరాబాదును కూడా అభివృద్ది చేస్తామని ఆయన చెప్పారు. జనం బిజెపి వైపు ఉన్నారని కిషన్ రెడ్డి చెప్పారు. 

హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీలు ఉన్నారని, తాము మేయర్ పీఠం అధిష్టించిన వెంటనే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ అన్నారు. రోహింగ్యాల ఓట్లతో గెలిచే గెలుపు గెలుపేనా అని ఆడిగారు 

బండి సంజయ్ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. బండి సంజయ్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఆయన ట్విట్టర్ వేదిక ప్రతిస్పందించారు. కొన్ని ఓట్లు, కొన్ని సీట్ల కోసం బండి సంజయ్ ఇలా మాట్లాడడం సరి కాదని ాయన అననారు 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్