జీహెచ్ఎంసీ ఎన్నికలు: మహంకాళి ఆలయంలో బండి సంజయ్

By telugu teamFirst Published Nov 30, 2020, 10:54 AM IST
Highlights

బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సికింద్రాాబాదులోని మహంకాళి ఆలయాన్ని సందర్శించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసిన నేపథ్యంలో ఆయన మహంకాళి అమ్మవారికి పూజలు చేశారు.

హైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసిన నేపథ్యంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సికింద్రాబాదులోని మహంకాళి దేవాలయాన్ని సందర్శించారు అక్కడ ఆయన అమ్మవారికి పూజలు నిర్వహించారు. 

బండి సంజయ్ బిజెపి కార్యాలయంలో గణపతి హోమం చేయనున్నట్లు తెలుస్తోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. బిజెపి, ఎంఐఎం, టీఆర్ఎస్ నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణం హైదరాబాదులో వేడెక్కింది.

రేపు మంగళవారం డిసెంబర్ 1వ తేదీన జిహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాటు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి, టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. కాంగ్రెసు, టీడీపీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నకల్లో కాంగ్రెసును బిజెపి వెనక్కి నెట్టి ముందుకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. 

click me!