బీజేపీ, ఎంఐఎం దొందూ దొందే.. వారివి బుద్దిలేని మాటలు... ఉత్తమ్ కుమార్ రెడ్డి

Published : Nov 26, 2020, 03:01 PM IST
బీజేపీ, ఎంఐఎం దొందూ దొందే.. వారివి బుద్దిలేని మాటలు... ఉత్తమ్ కుమార్ రెడ్డి

సారాంశం

బీజేపీని అన్ని రాష్ట్రాల్లో  గెలిపించడానికే అసదుద్దీన్ ప్రయత్నం చేస్తున్నారని వెస్ట్ బెంగాల్ ఎంఐఎం ప్రెసిడెంట్ ఆరోపించారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీ, ఎంఐఎం ఇద్దరు ఒక్కటేనని, బండి సంజయ్ కి హైదరాబాద్ ఎక్కడా మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసా?

బండి సంజయ్ కి హైదరాబాద్ కు  ఏం సంబంధం? బీజేపీ ఓట్లకోసం ఎంఐఎం, ఎంఐఎం ఓట్లకోసం బీజేపీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. 

వీళ్లిద్దరివీ బుద్దిలేని మాటలని, కాంగ్రెస్ పార్టీ ప్రజల కష్టసుఖల్లో తోడుగా ఉందని దీన్ని ప్రజలు గమనించాలని అన్నారు. కేంద్రం పెట్టిన ప్రతి బిల్లుకు కేసీఆర్ మద్దతు పలికారని, రాజకీయ లబ్ది కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

హైదరాబాద్ లో మత సామరస్యం కోసం పాటుపడాలి కానీ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఎన్నికల సంఘం పార్థసారథి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్