తెలంగాణలో టీడీపీ శకం ముగిసిందా? గ్రేటర్లో డిపాజిట్లు కూడా దక్కని టీడీపీ..

By AN TeluguFirst Published Dec 5, 2020, 10:08 AM IST
Highlights

తెలంగాణలో ఇప్పటికే ఉందో లేదు అన్నట్టుగా ఉన్న టీడీపీ జీహెచ్ఎంసీ ఎన్నికలతో పూర్తిగా కనుమరుగయ్యింది. 106 డివిజన్లలో అభ్యర్థులను నిలబెట్టినా ఒక్కసీటూ దక్కించుకోలేకపోయారు. 

తెలంగాణలో ఇప్పటికే ఉందో లేదు అన్నట్టుగా ఉన్న టీడీపీ జీహెచ్ఎంసీ ఎన్నికలతో పూర్తిగా కనుమరుగయ్యింది. 106 డివిజన్లలో అభ్యర్థులను నిలబెట్టినా ఒక్కసీటూ దక్కించుకోలేకపోయారు. 

తెలుగుదేశం పార్టీని గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో ఏకంగా 106 డివిజన్లలో అభ్యర్థులను బరిలో దింపిన ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్‌ కూడా దక్కలేదు. హైదరాబాద్ నిర్మించానని చెప్పుకునే తెలుగుదేశం పార్టీని ఆ హైదరాబాదీయులే తిరస్కరించారు. 

హైటెక్‌ సిటీని తామే నిర్మించామని, చంద్రబాబు విజన్‌తోనే హైదరాబాద్‌ అభివృద్ధి జరిగిందనే ప్రచారం చేసుకునే టీడీపీకి జీహెచ్‌ఎంసీ ప్రజలు దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చారు. గ్రేటర్‌ పరిధిలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసిన ఒక్క డివి జన్‌లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించలేక పోయారు. 

ఇప్పటికే గ్రామీణ తెలంగాణలో దాదాపు కనుమరుగయిన తెలుగుదేశం పార్టీ, జీహెచ్‌ఎంసీ ఫలితాలతో హైదరా బాద్‌లో ఖతం అయిందని, ఇక ఆ పార్టీ దుకాణం తెలంగాణలో బంద్‌ అయినట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ కూడా బోసిపోయింది. కనీసం ఒక్క నాయకుడు కూడా కార్యాలయానికి వచ్చి ఫలితాలపై ఆరా తీసే పరిస్థితి లేకుండా పోవడం గమనార్హం.  
 

click me!