ఎస్ఈసీకి షాక్: సర్య్యులర్ సు సస్పెండ్ చేసిన హైకోర్టు

Published : Dec 04, 2020, 10:01 AM ISTUpdated : Dec 04, 2020, 10:10 AM IST
ఎస్ఈసీకి షాక్: సర్య్యులర్ సు సస్పెండ్ చేసిన హైకోర్టు

సారాంశం

పెన్నుతో టిక్కు పెట్టినా కూడా ఓటును పరిగణనలోకి తీసుకోవాలని ఎస్ఈసీ రాత్రి జారీ చేసిన సర్క్యులర్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. స్వస్తిక్ ముద్ర ఉన్న ఓట్లు మాత్రమే చెల్లుతాయని స్పష్టం చేసింది.

హైదరాబాద్: బ్యాలెట్ పత్రంపై ఏ మార్కర్ పెన్నుతో టిక్కు పెట్టినా ఓటు చెల్లినట్లు పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన సర్య్కులర్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. స్వస్తిక్ మార్కు మాత్రమే కాకుండా పెన్నుతో మార్క్ చేసినా కూడా ఆ ఓటును పరిగణనలోకి తీసుకోవాలని ఎస్ఈసీ గురువారం రాత్రి సర్క్యులర్ జారీ చేసింది. 

ఎస్ఈసీ సర్య్కులర్ ను సవాల్ చేస్తూ బిజెపి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఆ సర్క్యులర్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్వస్తిక్ ముద్ర ఓట్లు మాత్రమే చెల్లుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని ఆదేశించింది. తుది ఉత్తర్వులను బట్టి ఫలితాలను వెల్లడించాలని ఆదేశించింది.

ఇదిలావుంటే, బ్యాలెట్ పత్రంపై స్వస్తిక్ గుర్తు మాత్రమే కాకుండా ఏ మార్కర్ పెన్నుతో టిక్కు పెట్టినా ఆ ఓటను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) సర్క్యులర్ జారీ చేయడంపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆ సర్క్యులర్ జారీ చేయడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కౌంటింగ్ అధికారులకు మాత్రమే ఆ సర్క్యులర్ జారీ చేయడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన అడిగారు. 

ప్రగతి భవన్ నుంచి ఆదేశాల మేరకే ఎన్నికల కమిషనర్ ఆ సర్క్యులర్ జారీ చేశారని ఆయన విమర్శించారు. తక్షణం సర్క్యులర్ ను రద్దు చేయాలని, ఈ సంఘటనపై విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

సర్క్యులర్ జారీపై హైకోర్టుకు వెళ్తాం గానీ ఓట్ల లెక్కింపును అడ్డుకోబోమని ఆయన స్పష్టం ేచశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి, ఎస్ఈసీకి గుణపాఠం తప్పదని ఆయన అన్నారు. ఎస్ఈసీని ఆయన గ్యాంబ్లర్ గా అభివర్ణించింది. ఎస్ఈసీ చరిత్రహీనుడుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. 

పోలింగ్ రోజు 3 గంటల వరకు గంటగంటకూ పోలింగ్ శాతం వివరాలు అందించిన అధికారులకు సాయంత్రం 5,6 గంటల మధ్య జరిగిన పోలింగ్ శాతం ఇవ్వడానికి అర్థరాత్రి దాకా ఎందుకు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు సాయంత్రం 4,6 గంటల మధ్య పథకం ప్రకారం టీఆర్ఎస్ పోలింగ్ శాతం పెంచిందని ఆయన విమర్శించారు 

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu