యూసుఫ్ గుడాలో టీఆర్ఎస్ గెలుపు: ఎంఐఎం ఖాతాలో తొలి ఫలితం

Published : Dec 04, 2020, 12:17 PM ISTUpdated : Dec 04, 2020, 12:26 PM IST
యూసుఫ్ గుడాలో టీఆర్ఎస్ గెలుపు: ఎంఐఎం ఖాతాలో తొలి ఫలితం

సారాంశం

చెప్పినట్లుగా తొలిగా మెహిదీపట్నం డివిజన్ ఫలితం వెలువడింది. మెహిదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మజీద్ హుస్సేన్ విజయం సాధించింది. తొలి ఫలితం ఎంఐఎం ఖాతాలో పడింది.

హైదరాబాద్: జిహెఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువుడుతున్నాయి. యూసుఫ్ గుడాలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ విజయం సాధించారు.

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలి ఫలితం బయటకు వచ్చింది. చెప్పినట్లుగా మెహిదీపట్నం ఫలితం బయటకు వచ్చింది. ఈ డివిజన్ లో ఎంఐఎం విజయం సాధించింది. మెహిదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మజీద్ హుస్సేన్ విజయం సాధించారు.యూసుఫ్ గుడాలో టీఆర్ఎస్ విజయం సాధించింది.

కాగా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు దాదాపుగా తిరగబడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తిరుగులేని ఆధిక్యత సాధించిన బిజెపి ఓట్ల లెక్కింపులో వెనకంజలోకి వెళ్లింది. తొలి రౌండ్ ఫలితాల్లో టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యం కొనసాగుతోంది.

కడపటి ఫలితాలను బట్టి టీఆర్ఎస్ 21 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బిజెపి, ఎంఐఎం రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. బిజెపి, ఎంఐఎం ఏడేసి స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. హైదరాబాదు మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి చెర్లపల్లి డివిజన్ లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

ఈ నెల 1వ తేదీన జిహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు ఈ రోజు జరుగుతోంది. జిహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. అన్ని డివిజన్లకు పోలింగ్ జరిగింది. 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet: పాలమూరు కి అప్పటి సమైఖ్య ప్రభుత్వం చేసిన ద్రోహం: కేసీఆర్| Asianet News Telugu
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !