దానకిశోర్‌పై బదిలీ వేటు: జీహెచ్ఎంసీ కమీషనర్‌గా రంగారెడ్డి కలెక్టర్

Siva Kodati |  
Published : Aug 26, 2019, 06:20 PM ISTUpdated : Aug 26, 2019, 06:25 PM IST
దానకిశోర్‌పై బదిలీ వేటు: జీహెచ్ఎంసీ కమీషనర్‌గా రంగారెడ్డి కలెక్టర్

సారాంశం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమీషనర్ దానకిశోర్‌పై తెలంగాణ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. బాధ్యతలు స్వీకరించిన ఏడాదికే ఆయనను ట్రాన్స్‌ఫర్ చేసింది. దానకిశోర్ స్థానంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్‌ను నియమించింది. 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమీషనర్ దానకిశోర్‌పై తెలంగాణ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. బాధ్యతలు స్వీకరించిన ఏడాదికే ఆయనను ట్రాన్స్‌ఫర్ చేసింది. దానకిశోర్ స్థానంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్‌ను నియమించింది. అయితే దానకిశోర్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.

మరోవైపు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న హరీశ్‌కి ప్రభుత్వం కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

2018 ఆగస్టు 24న అప్పట్లో జీహెచ్ఎంసీ కమీషనర్‌గా ఉన్న జనార్థన్‌రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో ప్రభుత్వం దానకిశోర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్