డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి హైద్రాబాద్‌కు తరలింపు: ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు

By narsimha lodeFirst Published Oct 13, 2019, 6:43 AM IST
Highlights

ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 19వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.


హైదరాబాద్: ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన ఖమ్మం ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ డిఆర్‌డిఏకు తరలించారు.

ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు ఆయనను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే  అక్కడే ప్రాథమికి చికిత్స చేసిన తర్వాత ఆయనను హైద్రాబాద్ ఢిఆర్‌డిఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

శ్రీనివాస్ రెడ్డిని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వథామరెడ్డి, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్  లు పరామర్శించారు.

డిఆర్ఢీఓ ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో వైపు ఆర్టీసీ కార్మికులు ఎవరూ కూడ ఆత్మహత్యాయత్నానికి పాల్పడకూడదని ఆర్టీసీ జేఎసీతో పాటు విపక్షాలు కోరాయి.

తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 19వ తేదీన తెలంగాణ బంద్ కు ఆర్టీసీ జేఎసీ, విపక్షాలు పిలుపునిచ్చాయి.సమ్మెను పురస్కరించుకొని తమ ఆందోళనలను ఆర్టీసీ జేఎసీ మరింత ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకొంది.ఇవాళ్టి నుండి ఈ నెల 19వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది జేఎసీ.

click me!