సర్వే రిపోర్టులొచ్చాయి, హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌దే గెలుపు: హరీష్ రావు

By narsimha lode  |  First Published Oct 27, 2021, 3:06 PM IST

హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ విజయం సాధిస్తాడని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ధీమాను వ్యక్తం చేశారు. బుధవారం నాడు ఆయన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.


హుజూరాబాద్:  Huzurabad bypoll లో టీఆర్ఎస్ అభ్యర్ధి Gellu Srinivas Yadav మంచి మెజారిటీతో విజయం సాధిస్తాడని  మంత్రి Harish Rao ధీమాను వ్యక్తం చేశారు.హూజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం నాడు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఇవాళ ఉదయమే రెండు మూడు సర్వేలు వచ్చాయి. ఈ సర్వే రిపోర్టులన్నీ కూడా గెల్లు శ్రీనివాస్ కు అనుకూలంగా ఉన్నాయన్నారు. అందుకే గెల్లు శ్రీనివాస్ ముఖంలో గెలుపు కళ కన్పిస్తోందన్నారు.ఇటీవల నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో Jana Reddyని ఓడించి Bhagath yadav విజయం సాధించాడు. భగత్ యాదవ్ విజయం సాధించిన తర్వాత నాగార్జునసాగర్ కు వెళ్లిన పలు అభివృద్ది కార్యక్రమాలకు కేసీఆర్ శంకుస్థాపనలు చేశారని ఆయన గుర్తు చేశారు. 

also read:huzurabad bypoll: ఇక్కడ పోలింగ్ ముగియగానే గ్యాస్ ధర పెంచేస్తారు .. బీజేపీపై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

Latest Videos

undefined

 ఇవాళ హుజూరాబాద్ లో Kcr సభ నిర్వహించకుండా అడ్డుకొన్నారన్నారు. కేసీఆర్ సభ నిర్వహిస్తే తమకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ సభ నిర్వహించకుండా ఆంక్షలు అడ్డుగా పెట్టారని ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించిన రెండు వారాలకే  ఈ నియోజకవర్గంలో కేసీఆర్ తో సభ నిర్వహించి ప్రజలకు వరాలు కురిపిస్తామని హరీష్ రావు హమీ ఇచ్చారు.ఎన్నికల ప్రచారం ముగిసే సమయం వచ్చినా కూడా హుజూరాబాద్ కు ఏం చేస్తారో బీజేపీ చెప్పడం లేదన్నారు.

Etela Rajender కు ఆత్మగౌరం ఇచ్చింది కేసీఆరేనన్నారు. ఢిల్లీలో ఈటల రాజేందర్  తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. దళితుల భూములను ఆక్రమించుకొన్న రోజే  ఈటల రాజేందర్ కు ఆత్మగౌరవ పోయిందన్నారు. వంటగ్యాస్ సిలిండర్ పై రాష్ట్ర ప్రభుత్వం 250 రూపాయాల పన్ను వేస్తోందనే విషయమై రాజేందర్ చేసిన సవాల్ కు తాను ప్రతి సవాల్ చేస్తే రాజేందర్ ఎందుకు స్పందించడం లేదని మంత్రి ప్రశ్నించారు.
 

click me!