జగిత్యాల తుంగూరులో ఉద్రిక్తత: రోడ్డు వివాదం‌పై అధికారులపై పెట్రోల్ పోసి నిప్పు

Published : May 10, 2022, 04:55 PM ISTUpdated : May 10, 2022, 05:04 PM IST
జగిత్యాల తుంగూరులో ఉద్రిక్తత: రోడ్డు వివాదం‌పై అధికారులపై పెట్రోల్ పోసి నిప్పు

సారాంశం

జగిత్యాల జిల్లాలోని తుంగూరులో దారి వివాదం గ్రామంలో ఉద్రిక్తతకు కారణమైంది. ఈ విషయమై గ్రామానికి వచ్చిన అధికారులపై గంగాధర్ అనే వ్యక్తి దాడికి దిగాడు.

జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని  Thungurలో దారి వివాదం విషయాన్ని పరిష్కరించేందుకు వచ్చిన  అధికారులపై గంగాధర్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.  ఈ ఘటనలో ఎంపీడీఓకు  గాయాలయ్యాయి.

Jagitial, జిల్లాలోని బీర్పూర్ మండలం తుంగూరులో Road వివాదం గ్రామంలో ఉద్రిక్తతలకు కారణమైంది. దారి విషయమై గంగాధర అనే వ్యక్తి రోడ్డుపై కర్రలు నాటాడు.ఈ విషయమై స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో తుంగూరు గ్రామానికి SI తహసీల్దార్, ఎంపీడీఓలు వచ్చారు.గ్రామానికి అధికారులు వచ్చిన విషయాన్ని గుర్తించిన గంగాధర్ వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఎంపీడీఓకు గాయాలయ్యాయి. ఆయనను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. గంగాధర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్