భర్తకి పిచ్చి, కొడుకుకి బుద్ధి మాంద్యం.. ఇదే అదునుగా చేసుకొని

Published : Oct 25, 2018, 10:42 AM IST
భర్తకి పిచ్చి, కొడుకుకి బుద్ధి మాంద్యం.. ఇదే అదునుగా చేసుకొని

సారాంశం

ఇద్దరూ  తరుచూ చరవాణిలో మాట్లాడుకునే వారు. దీన్ని  ఆసరాగా చేసుకున్న నగేశ్‌..ఆమెను లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు. 

కుటుంబ సమస్యలతో తల్లడిల్లిపోతున్న ఓ వివాహితపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  అసలే సమస్యలతో తల్లడిల్లుతున్న ఆమెను బెదిరించి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన  జగిత్యాలలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌కు చెందిన వివాహిత(33)కు భర్త, కుమారుడు ఉన్నారు. భర్త మానసిక స్థితి సరిగా లేదు. ఎనిమిదేళ్ల కుమారుడు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. ఏడాది కిందట జగిత్యాలకు చెందిన నగేశ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ  తరుచూ చరవాణిలో మాట్లాడుకునే వారు. దీన్ని  ఆసరాగా చేసుకున్న నగేశ్‌..ఆమెను లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు. 

ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో చరవాణి సంభాషణల తాలూకూ వివరాలు బయటపెడతానంటూ ఆమెను బెదిరించాడు. ఆ వివరాలు కావాలంటే తాను చెప్పిన చోటుకు రావాలని కోరాడు. నిస్సహాయ స్థితిలో బాధితురాలు ఆదివారం కుమారుడిని వెంటబెట్టుకుని జగిత్యాలకు వెళ్లింది.

 ‘‘బస్సు దిగగానే కుమారుడిని ఓ వ్యక్తి వెంటతీసుకెళ్లగా..మరోఇద్దరు నన్ను కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం అందరూ నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో నన్ను, నా బిడ్డను బస్టాండులో వదిలేసి వెళ్లారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక పుట్టి పెరిగిన నిజామాబాద్‌ వెళ్లానంటూ’ బాధితురాలు నిజామాబాద్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులను గుర్తించామని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ