రేపు ఉదయం వరకు గణేష్ విగ్రహాల శోభాయాత్ర: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి

By narsimha lode  |  First Published Sep 28, 2023, 11:40 AM IST

రేపు ఉదయం వరకు గణేష్ విగ్రహాల నిమజ్జంన కొనసాగుతుందని  భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్పారు. 


హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో గణేష్ విగ్రహాల శోభాయాత్ర జరుగుతున్న తీరును గురువారంనాడు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు  పరిశీలించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతున్న తీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. రేపు ఉదయం వరకు  గణేష్ విగ్రహాల నిమజ్జనం సాగుతుందని గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్పారు. నగరంలోని లక్షకు పైగా విగ్రహాల నిమజ్జనం  చేయనున్నట్టుగా  ఉత్సవ సమితి సభ్యులు చెప్పారు.

ఇవాళ ఉదయం నుండి నగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రారంభమైంది. హైద్రాబాద్  ఖైరతాబాద్  గణేష్ విగ్రహాం ఉదయం ఆరు గంటలకే  నిమజ్జనానికి బయలుదేరింది.  ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకే  ఖైరతాబాద్ గణేష్ విగ్రహాం  నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు ఏర్పాట్లు చేశారు.  గత రెండేళ్ల కంటే ముందుగానే  ఖైరతాబాద్ గనేష్ విగ్రహాం  ట్యాంక్ బండ్ లో నిమజ్జనం కానుంది.  

Latest Videos

undefined

హైద్రాబాద్ నగరంలోని సుమారు లక్షకు పైగా  గణేష్ విగ్రహాల నిమజ్జనం కానుంది. హైద్రాబాద్ హుస్సేన్ సాగర్,  సరూర్ నగర్ , రాంపూర్, సఫిల్ గూడ, కాప్రా సహా పలు చెరువులు, కొలనుల్లో  వినాయక విగ్రహాల నిమజ్జనం చేస్తారు.  ప్రధానంగా హుస్సేన్ సాగర్,  సరూర్ నగర్ చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం సాగుతుంది.

also read:బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర:రూ. 27 లక్షలకు దక్కించుకున్న దాసరి దయానంద్ రెడ్డి

బాలాపూర్ లడ్డూ వేలం ముగియడంతో బాలాపూర్ గణేష్ విగ్రహాం కూడ హుస్సేన్ సాగర్ వైపు బయలు దేరింది. ఖైరతాబాద్ గణేష్ విగ్రహా నిమజ్జనం పూర్తైతే  వినాయక నిమజ్జనంలో  ప్రధాన ఘట్టం పూర్తైనట్టుగా అధికారులు భావిస్తారు. ఈ  విగ్రహాం నిమజ్జనం పూర్తైతే  ఇతర విగ్రహాల నిమజ్జనం వేగంగా చేసేందుకు వీలు కానుంది. దీంతో ఈ విగ్రహాన్ని  మధ్యాహ్నం లోపుగా పూర్తి చేయాలని అధికారులు ప్లాన్ చేశారు. 
 

click me!