బాలాపూర్ లడ్డూను దాసరి దయానంద్ రెడ్డి రూ. 27 లక్షలను దాసరి దయానంద్ రెడ్డి దక్కించుకున్నారు.
హైదరాబాద్: బాలాపూర్ లడ్డూను రూ. 27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి గురువారం నాడు దక్కించుకున్నారు.గత ఏడాది కంటే రూ. 2 లక్షల కంటే 40 వేల అదనంగా లడ్డూ ధర పలికింది. 1994 నుండి బాలాపూర్ లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. ఇవాళ బాలాపూర్ గణేష్ మండపం నుండి బొడ్రాయి వరకు గణేష్ విగ్రహాన్ని తీసుకు వచ్చారు. బాలాపూర్ లడ్డూ వేలం పాటను ప్రారంభించారు. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలంలో 36 మంది పాల్గొన్నారు.తుర్క యంజాల్ కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు.
గత ఏడాది వంగేటి లక్ష్మారెడ్డి రూ. 24.60 లక్షలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూ వేలానికి ఇవాళ్టితో 30 ఏళ్లు పూర్తైంది.గత ఏడాది కూడ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటలో దాసరి దయానంద్ రెడ్డి పాల్గొన్నారు. గత ఏడాది లడ్డూను దక్కించుకున్న లక్ష్మారెడ్డి తర్వాతి స్థానంలో దయానంద్ రెడ్డి నిలిచారు. అయితే ఈ దఫా ఈ లడ్డూను దక్కించుకోవాలనే పట్టుదలతో దయానంద్ రెడ్డి వేలంలో పాల్గొన్నారు. గత ఏడాది లడ్డూను దక్కించుకున్న లక్ష్మారెడ్డి తర్వాతి స్థానంలో దయానంద్ రెడ్డి నిలిచారు.
undefined
also read:ఎక్కువసార్లు ఆ కుటుంబానికే లడ్డూ: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం చరిత్ర ఇదీ....
అయితే ఈ దఫా ఈ లడ్డూను దక్కించుకోవాలనే పట్టుదలతో దయానంద్ రెడ్డి వేలంలో పాల్గొన్నారు. ఇతరుల కంటే ఎక్కువ ధరను కోడ్ చేసి లడ్డూను దక్కించుకున్నారు. అయితే ఇక నుండి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న వారంతా అదే ఏడాది గణేష్ ఉత్సవ సమితికి డబ్బులు చెల్లించాలని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి నిర్ణయం తీసుకుంది. గతంలో మాత్రం ఈ ఏడాది లడ్డూను దక్కించుకున్న వారు వచ్చే ఏడాది లడ్డూ వేలం పాట సమయానికి డబ్బును చెల్లించాల్సి ఉండేది. అయితే ఈ లడ్డూను దక్కించుకున్న బాలాపూర్ వాసులకు ఈ విషయంలో కొంత వెసులుబాటు ఉండేది. అయితే వచ్చే ఏడాది నుండి బాలాపూర్ వాసులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడ లడ్డూను దక్కించుకున్న ఏడాదే డబ్బులను చెల్లించాలని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది.
బాలాపూర్ ను లడ్డూను దక్కించుకొంది వీరే...
1) కోలన్ మోహన్ రెడ్డి 450/ - 1994.
2 కోలన్ మోహన్ రెడ్డి 4500/ -. 1995.
3)కోలన్ కృష్ణారెడ్డి 18000 /-. 1996.
4)కోలన్ కృష్ణారెడ్డి 28000/- 1997.
5) కోలన్ మోహన్ రెడ్డి 51000/ - 1998.
6) కళ్ళెం ప్రతాప్ రెడ్డి 65000/- 1999.
7) కళ్ళం అంజి రెడ్డి 66000/- 2000.
8)జి. రఘునందన్ చారి 85000/- 2001.
9) కందాడ మాధవరెడ్డి 105000/- 2002.
10) చిగురంత బాల్ రెడ్డి 1,55000/- 2003.
11) కోలన్ మోహన్ రెడ్డి 2,01000 2004.
12) ఇబ్రహీం శేఖర్ 2,08000 2005.
13)చిగురంత తిరుపతి రెడ్డి 300000 2006.
14)G.రఘునందన్ చారి 4,15000/- 2007.
15) కోలన్ మోహన్ రెడ్డి 5,07000/- 2008.
16) సరిత 510000/- 2009.
17) కోడలి శ్రీధర్ బాబు 535000/- 2010.
18) కోలన్ బ్రదర్స్ 545000/- 2011.
19)పన్నాల గోవర్ధన్ 750000/- 2012.
20)తీగల కృష్ణ రెడ్డి 926000/- 2013.
21) సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 950000/- 2014.
22)కళ్లెం మదన్ మోహన్ రెడ్డి 1032000/- 2015.
23) స్కైల్యాబ్ రెడ్డి 14,65000 /- 2016.
24) నాగం తిరుపతి రెడ్డి 1560000 /- 2017.
25) శ్రీనివాస్ గుప్తా 16.60000 /- 2018
26) కొలను రాంరెడ్డి. 17.50 లక్షలు -2019
27). కరోనా కారణంగా వేలం పాట నిర్వహించలేదు. కానీ ఈ లడ్డూను కేసీఆర్ కుుటుంబానికి అందించారు. 2020
28.) ఏపీ ఎమమెల్సీ రమేష్ యాదవ్, శశాంక్ రెడ్డి. రూ.18.90 లక్షలు - 2021
29).వంగేటి లక్ష్మారెడ్డి రూ. 24.60 లక్షలు- 2022
30). దాసరి దయానంద్ రెడ్డి రూ. 27 లక్షలు-2023