Ganesh Chaturthi 2023: చంద్రయాన్-3 మోడల్ గ‌ణ‌ప‌తి విగ్రహాలకు మ‌స్తు డిమాండ్.. !

By Mahesh Rajamoni  |  First Published Sep 6, 2023, 10:33 AM IST

Hyderabad: హిందువుల పండుగలలో ఒకటైన గణేష్ చతుర్థికి ముందు హైదరాబాద్‌లో గణేశ విగ్రహాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌యాన్-3 మోడ‌ల్ గ‌ణ‌ప‌తి విగ్ర‌హాలు మ‌స్తు డిమాండ్ ఏర్ప‌డింది. రికార్డు ధ‌ర‌లు ఉన్నాయ‌ని స‌మాచారం. గణేష్ చతుర్థిని దేశ‌వ్యాప్తంగా 10 రోజుల పాటు ఘ‌నంగా జరుపుకుంటారు. ఈ సమయంలో, గణేశుడు తన తల్లి, పార్వతీ దేవితో కలిసి భూమిపైకి వస్తాడనీ, ప్రజలపై దీవెనలు కురిపిస్తాడని నమ్ముతారు.
 


Ganesh chaturthi 2023: హిందువుల పండుగలలో ఒకటైన గణేష్ చతుర్థికి ముందు హైదరాబాద్‌లో గణేశ విగ్రహాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.  మ‌రీ ముఖ్యంగా చంద్ర‌యాన్-3 మోడ‌ల్ గ‌ణ‌ప‌తి విగ్ర‌హాలు మ‌స్తు డిమాండ్ ఏర్ప‌డింది. రికార్డు ధ‌ర‌లు ఉన్నాయ‌ని స‌మాచారం. గణేష్ చతుర్థిని దేశ‌వ్యాప్తంగా 10 రోజుల పాటు ఘ‌నంగా జరుపుకుంటారు. ఈ సమయంలో, గణేశుడు తన తల్లి, పార్వతీ దేవితో కలిసి భూమిపైకి వస్తాడనీ, ప్రజలపై దీవెనలు కురిపిస్తాడని నమ్ముతారు.

వివ‌రాల్లోకెళ్తే.. గణేష్ చతుర్థి పండుగకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతున్న తరుణంలో చంద్రయాన్ -3 మోడల్ విగ్రహాలు రికార్డు స్థాయిలో అత్యధిక ధ‌ర‌లకు చేరుకున్నాయి. వీటితో పాటు హైదరాబాద్ లో వివిధ రకాల గణపతి విగ్రహాలకు డిమాండ్ పెరిగింది. ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలకు కూడా డిమాండ్ పెరుగుతోందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ప్ర‌జ‌ల అభిరుచుల‌కు అనుగుణంగా కూడా విగ్రహాలు త‌యారు చేస్తున్నామ‌ని  పేర్కొంటున్నారు. బాల గ‌ణేష్ నుంచి వివిధ చారిత్ర‌క స‌న్నివేశాల‌ను ప్రతిబింబించే విధంగా కూడా విగ్ర‌హాలు త‌యారు చేసిన‌ట్టు పేర్కొంటున్నారు.

Latest Videos

హిమాయత్ నగర్ కు చెందిన నవీన్ జైస్వాల్ అనే వ్యాపారి మాట్లాడుతూ.. ''25 ఏళ్లుగా గణేష్ విగ్రహాలను విక్రయిస్తున్నాను. 500 నుండి 65,000 వరకు  వినాయ‌కుడికి సంబంధించిన‌ అన్ని రకాలు విగ్రహాలు ఉన్నాయి. మా వద్ద వివిధ రకాల గణేష్ విగ్రహాలు ఉన్నాయి. ఎకో ఫ్రెండ్లీ గణేష్ కూడా ఉన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కస్టమర్లు, సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ వినాయక విగ్రహాలు కొనుగోలు చేసేందుకు వస్తుంటారని చెప్పిన‌ట్టు'' సియాస‌త్ నివేదించింది.

వివిధ రకాల వినాయక మోడళ్లకు ఉన్న డిమాండ్ గురించి వివరిస్తూ,'ధోతీ, షాల్, పగిడితో కూడిన క్లాత్ లో గణేష్ వంటి వివిధ రకాల మోడల్స్ మా వద్ద ఉన్నాయి. చంద్రయాన్-3 మోడల్ కు కూడా భారీ డిమాండ్ ఉంది. 1 అడుగుల నుంచి 2 అడుగుల ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు ఉన్నాయి. ముంబ‌యి, పూణే తదితర ప్రాంతాల నుంచి కూడా విగ్రహాలు తెప్పించాం. మా వద్ద 300 రకాల గణేష్ విగ్రహాలు ఉన్నాయ‌ని చెప్పారు. విగ్రహాల రేట్లు సహేతుకంగా ఉండటంతో వినియోగదారులు దుకాణాల నుంచి వినాయక విగ్రహాలను కొనుగోలు చేసేందుకు వస్తున్నారని స్థానిక వ్యాపారులు తెలిపారు.

ఈ దుకాణం 25 ఏళ్ల నాటిదనీ, 15 ఏళ్లుగా అమ్మవారి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రేట్లు నామమాత్రంగా ఉంటాయ‌నీ, లాల్బాగ్ కా రాజా, దగ్దు గణేష్, చింతామణి గణేష్ వంటి వివిధ రకాల గణేష్ విగ్రహాలను విక్ర‌యిస్తున్నామ‌ని చెప్పారు. హైదరాబాద్ లో చాలా మంది అమ్మకందారులు ఉన్నారని, ఈసారి వినాయక విగ్రహాల ప్రత్యేక నమూనాలను విక్రయిస్తున్నారని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. వినాయ‌క చ‌తుర్థుకి ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ చాలా ప్రాంతాల్లో భ‌క్తులు విగ్ర‌హాల‌ను నిల‌బెట్ట‌డానికి ఏర్పాట్లు షురూ చేశారు.

click me!