కేసీఆర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌కు షాక్ : కాంగ్రెస్‌లో చేరిన ఎంపిపి, ఎంపిటిసిలు

By Arun Kumar PFirst Published Oct 3, 2018, 6:05 PM IST
Highlights

తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారుతున్నాయి. సొంత పార్టీ నిర్ణయాలపై అసమ్మతితో కొందరు జంపింగ్ లకు  పాల్పడుతుంటే... ఇతర పార్టీల ఆకర్ష్ లో భాగంగా మరికొందరు నాయకులు పార్టీలు మారుతున్నారు. ఇలా తెలంగాణలోని అన్ని పార్టీల్లో వలసల పరంపర కొనసాగుతోంది.

అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ లో కూడా  ఈ వలసల పర్వం కొనసాగుతోంది. ఈ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ముఖ్య నేతలు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.  మరోసారి గజ్వెల్ నుండి కేసీఆర్ పోటీకి దిగుతున్న సమయంలో ఈ వలసల కలకలం రేపుతున్నారు.  

గజ్వెల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్‌ మండల పరిషత్ ప్రెసిడెంట్ రేణుక టిపిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 

ప్రస్తుత చేరికలతో కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గంలో మరింత బలోపేతమయ్యిందని ఉత్తమ్ అన్నారు. ఈ నియోజకవర్గంలో సీఎంకు వ్యతిరేకంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి గట్టి నేతగా ఎదిగారని తెలిపారు. గజ్వేల్‌లో మరోసారి కాంగ్రెస్‌ పార్టీని గెలుపుంచుకునే బాధ్యత ఇక్కడి నాయకులే తీనుకోవాలని ఉత్తమ్ సూచించారు.   

click me!