గద్వాల్ లో కాంగ్రెస్ కు భారీ షాక్ .. బీఆర్ ఎస్ లో చేరిన సీనియర్ నేత..

By Rajesh Karampoori  |  First Published Oct 19, 2023, 2:26 AM IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటినుంచి పార్టీలు ఫిరాయిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే విపక్ష కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతోంది. తాజాగా గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్ది, వారితోపాటు మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ ఉమ దేవి, జిల్లా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లోచేరారు.


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి నేతల ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష కాంగ్రెస్ కు  షాక్ ల మీద షాక్ లు తగులుతోంది. తాజాగా తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్ది, వారితోపాటు మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ ఉమ దేవి, జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. వారికి మంత్రి హరీష్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం లేదనీ, ఆ పార్టీలో నాయకత్వ కొరత ఉందని విమర్శించారు. డబ్బు కట్టలకు టికెట్లు అమ్ముకునే సంస్కృతి సహించలేక బీఆర్ఎస్ పార్టీపై విశ్వాసంతో పార్టీలో చేరుతున్నట్లు పటేల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషిచేసి అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించేందుకు కష్టపడతామని, జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు.  

Latest Videos

ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుందనీ,  ముఖ్యంగా గద్వాలలో మళ్లీ గెలిచేది బిఆర్ఎస్ పార్టీనే అని దీమా వ్యక్తం చేశారు.  గద్వాల్ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి  బీఆర్ఎస్ పార్టీ వల్లే జరిగిందనీ,  ఇకపై కూడా అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. గద్వాల్ లో కృష్ణమోహన్ రెడ్డిని  గెలిపించుకుందామనీ, గద్వాల్  అభివృద్ధిని కొనసాగిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.

కంటి ముందు అభ్యర్థి ఇంటి ముందు అభివృద్ధి.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి. ఎప్పుడూ ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసమే పాటు పడతారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో, మ్యానిఫెస్టో విడుదలలో, ప్రచారంలో ఎట్లైతే ముందు ఉందో రేపు జరిగే ఎన్నికల్లో కూడా విజయం సాధించడంలో బిఆర్ఎస్ పార్టీ ముందుంటుందని తెలిపారు. 

బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దొరకడం లేదనీ, కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధు, రైతుబంధు, ఉచిత కరెంటు, ఆసరా పెన్షన్ వంటి సంక్షేమ పథకాల పేర్లు మార్చి కాంగ్రెస్ గ్యారెంటీల పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.  

కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలకి ఎవరు గ్యారెంటీ అని ప్రజలు అడుగుతున్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకి, హామీలకు సీఎం కేసీఆర్ గారు గ్యారెంటీ అని పేర్కొన్నారు. ఈ తొమ్మిది సంవత్సరాల్లో చెప్పిన చెప్పని ఎన్నో హామీలను నెరవేర్చి తిరిగి ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గెలిపించుకుందామని కోరారు. 

click me!