టీడీపీతో కాంగ్రెస్ పొత్తు: ఉత్తమ్, లక్ష్మణ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ

By narsimha lodeFirst Published Aug 27, 2018, 4:27 PM IST
Highlights

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో  టీఆర్ఎస్‌ను ఓడించే విషయంలో ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. 


హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో  టీఆర్ఎస్‌ను ఓడించే విషయంలో ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ముందస్తు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్‌కే ఎక్కువగా నష్టమని  వీరిద్దరూ కూడ అభిప్రాయపడ్డారు.

నీటిపారుదల ప్రాజెక్టుల విషయమై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో  పలు రాజకీయపార్టీల ప్రతినిధులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.  ఈ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కొద్దిసేపు మాట్లాడుకొన్నారు.

ముందస్తు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్‌కే నష్టమనే అభిప్రాయాన్ని  వీరిద్దరూ వ్యక్తం చేశారు.  ముందస్తు ఎన్నికల విషయంలో కేంద్రం చేయడానికి ఏముండదన్నారు.  గవర్నర్, రాష్ట్రపతి,. ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుందని లక్ష్మణ్ చెప్పారు.

టీడీపీతో పొత్తు వల్ల లాభం ఉండదని బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్  ఉత్తమ్‌తో చెప్పారు. కానీ, ఉత్తమ్ కూడ ఈ విషయమై స్పందించారు. టీఆర్ఎస్‌ను ఓడించేందుకుగాను  అన్ని పార్టీలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని బదులిచ్చారు. అయితే తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడ అన్ని పార్టీలు కూడ సిద్దంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

click me!