ఆ లింక్స్ క్లిక్ చేస్తున్నారా? అయితే మీ బ్యాంకు బ్యాలెన్స్ గోవిందే: సీపీ సజ్జనార్

By Nagaraju penumalaFirst Published Nov 20, 2019, 3:34 PM IST
Highlights

 తెలంగాణ రాష్ట్రంలో గూగుల్ లింక్స్ పంపి పెద్ద మెుత్తంలో డబ్బులు కాజేస్తున్న జముతార గ్యాంగ్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గూగుల్ లింక్స్ పంపి పెద్ద మెుత్తంలో డబ్బులు కాజేస్తున్న జముతార గ్యాంగ్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. 

గూగుల్ లింక్స్ ను ఎస్ఎంఎస్ గా పంపించి ఖాతాదార్లు ఖాతాల్లోంచి డబ్బును దోచుకుంటున్నట్లు సజ్జనార్ తెలిపారు. ఫుడ్ ఫాండా, గూగుల్ లింక్స్ వంటి వాటిని బేస్ చేసుకుని డబ్బులు కాజేస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే హైదరాబాద్ నగరంలో ఎస్ బీఐ కస్టమర్ ను కూడా ఇలాగే మోసం చేశారని తెలిపారు. 

హైదరాబాద్ కు చెందిన ఓ కస్టమర్ కు కాల్ సెంటర్ నుంచి అని ఫోన్ చేసి వారం రోజుల్లో రూ.5లక్షలకు పైగా డబ్బులు కాజేశారని ఆరోపించారు. ఆ సొమ్మును ఒకచోటే ఖర్చుపెట్టకుండా వేర్వేరు చోట్ల అంటే బంగారు దుకాణాలు, షాపింగ్ లకు వినియోగిస్తుండగా అడ్డంగా దొరికారని తెలిపారు. 

నేషనల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా విధానంలో భాగంగా ప్రతీ ఒక్కరూ యూపీఐ కోడ్ పొందుతున్నారని తెలిపారు. ఈ యూపీఐ కోడ్ ను కూడా ఆసరాగా చేసుకుని డబ్బు కాజేస్తున్నారని తెలిపారు. అలాగే పలువురు కస్టమర్లకు ఫోన్లు చేసి యూపీఐ కోడ్ తెలుసుకోవడం లేకపోతే ఏటీఎం వెనుక నంబర్ తెలుసుకుని ఇలా అనేక రకాలుగా డబ్బులు కాజేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఒకప్పుడు ఓటీపీ ద్వారా దోపిడీకి పాల్పడిన జముతార బ్యాచ్ అనంతరం ఈవ్యాలెట్ ప్రస్తుతం యూపీఐ కోడ్ లను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇకపోతే గూగుల్ పేమెంట్ లో భాగంగా కూడా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారంటూ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

click me!