తెలంగాణలో విషాదం: ఈతకు వెళ్లి నలుగురు మృతి

Published : May 04, 2019, 08:38 PM IST
తెలంగాణలో విషాదం: ఈతకు వెళ్లి నలుగురు మృతి

సారాంశం

నలుగురు ఈతకొడుతుండగా లోతు తెలియకపోవడంతో మునిగిపోయారు. దీంతో ఊపిరాడక నలుగురు దుర్మరణం చెందారు. మృతిచెందిన నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారే కావడంతో ఆ గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.   

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో విషాదం చోటు చేసుకుంది. వేసవికాలం కావడంతో చెరువులో సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు విగత జీవులుగా మారారు.  కొలనూరులో ఉన్న ఒక చెరువులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈతకొట్టేందుకు వెళ్లారు. 

నలుగురు ఈతకొడుతుండగా లోతు తెలియకపోవడంతో మునిగిపోయారు. దీంతో ఊపిరాడక నలుగురు దుర్మరణం చెందారు. మృతిచెందిన నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారే కావడంతో ఆ గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. 

మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులు రాజయ్య, ఆదర్శ్, జిత్తు, సిద్ధార్థగా గుర్తించారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెండు మృతదేహాలను వెలుపలికి తీశారు. మరో రెండు మృతదేహాలను వెలికి తియ్యాల్సి ఉంది. అయితే చీకటి పడిపోవడంతో సహాయక చర్యలను నిలిపివేశారు అధికారులు. 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : దిగజారిన టమాటా, స్థిరంగా ఉల్లి... ఈ వీకెండ్ కూరగాయల రేట్లు ఇవే
IMD Rain Alert : మరో అల్పపీడనం రెడీ .. ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు