రాజీవ్ రహదారిపై రోడ్డుప్రమాదం... చిన్నారి సహా నలుగురికి తీవ్రగాయాలు

By Arun Kumar PFirst Published Apr 28, 2023, 1:37 PM IST
Highlights

కరీంనగర్ శివారులో ఆర్టిసి బస్సు, ఆటో ఢీకొన్ని ఓ చిన్నారితో సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆరు గొర్రెలు మృతిచెందాయి. 

కరీంనగర్ : గొర్రెల మందను తప్పించే క్రమంలో ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ప్రయాణిలతో కూడిన ఆటోను ఆర్టిసి బస్సు వెనకనుండి ఢీకొట్టడంతో ఓ చిన్నారితో తో పాటు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గొర్రెలు కూడా చనిపోయాయి. 

కరీంనగర్-పెద్దపల్లి జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళుతున్న ఆటోకు ఒక్కసారిగా గొర్రెల మందం అడ్డువచ్చింది. దీంతో వేగంగా వెళుతున్న ఆటో ఒక్కసారిగా నెమ్మదించింది. అయితే ఆ ఆటో వెనకాల వున్న ఆర్టిసి బస్సును మాత్రం డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో అదే వేగంతో దూసుకెళ్లిన బస్సు ఆటోను వెనకనుండి ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఇలా గొర్రెల మందపైకి ఈ రెండు వాహనాలు దూసుకెళ్లాయి. 

Latest Videos

 కరీంనగర్ రూరల్ పరిధిలోని ముగ్దుంపూర్ స్కూల్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.బస్సు ఢీకొనడంతో ఆటోలోని ఓ చిన్నారితో పాటు మరో ఇద్దరు మహిళలు, గొర్రెల కాపరి తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఆరు గొర్రెలు అక్కడికక్కడే చనిపోగా మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. 

Read More  నిజామాబాద్ శివారులో ఘోర రోడ్డుప్రమాదం... ముగ్గురు కార్మికుల దుర్మరణం

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని కరీంనగర్ జిల్లా హాస్పిటల్ కు తరలించారు. వీరిలో గొర్రెల కాపరి బండి సంపత్ పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఆర్టిసి బస్సు గోదావరిఖని నుండి కరీంనగర్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

click me!