రూ. 1,250 కోట్లకు చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ ఫండ్.. నెలకు వడ్డీ ఎంతో తెలుసా?

By SumaBala Bukka  |  First Published Apr 28, 2023, 12:13 PM IST

బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీకి ఇప్పటివరకు సమకూరిన ఫండ్ వివరాలను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. 


హైదరాబాద్  : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వద్ద రూ.1,250 కోట్ల పార్టీ ఫండ్‌ ఉందని, అందులో రూ.767 కోట్ల బ్యాంకు డిపాజిట్లకు గానూ నెలకు ఏడు కోట్ల వడ్డీ వస్తుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. గురువారం జరిగిన బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవంలో కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీ నిర్వహణకు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి, ప్రచారానికి అయ్యే ఖర్చులను వడ్డీ ఆదాయంతోనే పెడుతున్నామన్నారు.
        
పార్టీ ఫండ్ రూ.1,250 కోట్లకు చేరిందని, అందులో రూ.767 కోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని, పార్టీ నిర్వహణకు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి, ప్రచారానికి, మౌలిక వసతుల కల్పనకు అయ్యే ఖర్చులు దీని నుంచే సమకూరుతాయని చెప్పారు.

అక్టోబర్ 21, 2021లో జరిగిన ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, పార్టీ (అప్పటి టీఆర్‌ఎస్) రూ. 425 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని, వీటితో నెలకు రెండు కోట్ల రూపాయల వడ్డీ వస్తుందని చెప్పారు.

Latest Videos

BRS Plenary: దేశానికి సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వం అవసరం : కే కేశవరావు
    
ఇక గురువారం బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ ఆర్థిక వ్యవహారాలపై ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానం ప్రకారం, ఇతర రాష్ట్రాల్లో బ్యాంకు ఖాతాలు తెరవడం, పార్టీ ప్రచారానికి మీడియా సమన్వయం కోసం వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో సహా పార్టీ ఆర్థిక వ్యవహారాలను పార్టీ అధ్యక్షుడు చూసుకుంటారు.

ఢిల్లీలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని మే 4న ప్రారంభించనున్నట్లు పార్టీ తెలిపింది. ఇదిలా ఉండగా, పార్టీని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భవిష్యత్తులో టీవీ ప్రకటనలు, సినిమా నిర్మాణాన్ని చేపట్టాలని, అవసరమైతే టీవీ ఛానెల్‌ని కూడా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.

ప్రతి అంశంలోనూ పారదర్శకత పాటించాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ అవినీతికి పాల్పడవద్దని కేసీఆర్‌ తన పార్టీ కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. 

ఇదిలా ఉండగా, గురువారం జరిగిన పార్టీ సమావేశంలో ఎంపీ కేశవరావు మాట్లాడుతూ.. దేశంలో సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వం అవసరమన్నారు. ప్రధాని మోడీ అదానీ గ్రూప్ ప్రయోజనాల కోసం దేశాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 

హైద‌రాబాద్ భ‌వ‌న్ లో జ‌రిగిన అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ప్లీన‌రీ స‌మావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీ కేశ‌వ‌రావు మాట్లాడారు. ఈక్రమంలోనే ప్ర‌ధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు డైనమిక్ నాయకత్వం దేశ ప్రగతికి అవసరమని అన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కేడర్ బీఆర్ఎస్ కు అసలైన బలమని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంలో పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించార‌ని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో కార్యకర్తలు, నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని.. జాతీయ లక్ష్యంపై దృష్టి సారించాలని.. పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

click me!