మట్టి పెళ్లలు పడి 11 మంది ఉపాధి కూలీల మృతి

By narsimha lodeFirst Published Apr 10, 2019, 12:17 PM IST
Highlights

: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలంలోని తీలేరులో బుధవారం నాడు మట్టి పెళ్లలు పడి పదకొండు మంది ఉపాధి హామీ కూలీలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
 

: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలంలోని తీలేరులో బుధవారం నాడు మట్టి పెళ్లలు పడి పదకొండు మంది ఉపాధి హామీ కూలీలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

             


ఉపాధి హమీ కూలీలు ఇవాళ ఉదయం మట్టి పనికి వెళ్లారు. మట్టి పెళ్లలు ఒక్కసారిగా మీద పడడంతో పదకొండు మంది అక్కడిక్కకడే  మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.తీలేరు గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు గ్రామ సమీపంలోని మట్టి పనికి వెళ్లారు.

       

అయితే మట్టి తవ్వుతున్న సమయంలో  ఒక్కసారిగా మట్టి పెళ్లలు మీద పడ్డాయి. దీంతో  మట్టి పెళ్లలు మీద పడి పదకొండు మంది అక్కడికక్కడే మృతి చెందారు.  మరికొందరు మట్టిపెళ్లల కిందే చిక్కుకొన్నారు.

మట్టి పెళ్లల కింద ఇంకా మృతదేహాలు ఉండే అవకాశం ఉందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.సంఘటన జరిగిన ప్రాంతంలో సుమారు 15 మంది పనిచేస్తున్నట్టుగా కూలీలు చెబుతున్నారు. 

        

ఇప్పటికే పదకొండు మంది మృతదేహాలను వెలికితీశారు. మట్టి పెళ్లల కింద ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉండి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మరో ఇద్దరికి ఈ ఘటనలో తీవ్రంగా గాయాలయ్యాయని అధికారులు చెబుతున్నారు.ఈ మేరకు ప్రొక్లెయినర్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే  మంత్రి శ్రీనివాస్ గౌడ్ హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ఇదిలా ఉంటే  ఉమ్మడి మహాబూబ్‌నగర్  జిల్లాలోజరిగిన దుర్ఘటనలో ఉపాధి హామీ కూలీలు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తున్నట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా మంత్రిని, అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు
 

 

click me!