బ్యాంక్ లో ఉద్యోగం ఇప్పిస్తానని...రూ.లక్షలు దోచేశాడు

By ramya NFirst Published Apr 10, 2019, 12:06 PM IST
Highlights

ప్రముఖ ఐటీ కంపెనీలు, బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించేవాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేసేవాడు.

ప్రముఖ ఐటీ కంపెనీలు, బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించేవాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేసేవాడు. డబ్బు చేతికి అందగానే.. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేవాడు. ఇలా గత కొంతకాలంగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్న వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం గొట్లగుంటకి చెందిన తోట మునిసుందర్ బాబు అలియాస్ బాబు(35) తొమ్మిదేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. దిల్ సుఖ్ నగర్ లోని సిద్ధార్థ్ స్మార్ట్ సొల్యూషన్స్ లో చేరాడు.

ఒక సంవత్సరం తర్వాత తానే సొంతంగా బిజినెస్ పెట్టాడు. కొంతకాలం బాగానే నడిచిన బిజినెస్ 2017 తర్వాత నష్టాలు చవిచూసింది. దీంతో అతను బిజినెస్ వదిలేసి స్వగ్రామానికి చేరాడు.  మళ్లీ 2018లో హైదరాబాద్ వచ్చి ఇషా సొల్యూషన్స్ పేరిట ఓ కంపెనీని ప్రారంభించాడు. కంపెనీ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రకటనలు ఇచ్చాడు.

ప్రముఖ ఐటీ కంపెనీలు, బ్యాంకుల్లో ఉద్యోగం ఇస్తానంటూ నిరుద్యోగుల వద్ద నుంచి రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు వసూలు చేశాడు. నకిలీ నియామక పత్రాలు కూడా వారికి ఇచ్చేశాడు. తీరా వాటినిపట్టుకొని ఉద్యోగం కోసం బ్యాంక్ కి వెళ్లిన తర్వాత తాము మోసపోయామని విద్యార్థులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. 
 

click me!