తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో మరో ట్విస్ట్: దేవికారాణి రూ. 10 కోట్ల బంగారు ఆభరణాలు మాయం

By narsimha lodeFirst Published Sep 2, 2020, 1:00 PM IST
Highlights

తెలంగాణ ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవీకారాణి అక్రమాస్తులపై ఏసీబీ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. అక్రమంగా సంపాదించిన డబ్బుతో దేవికారాణి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్టుగా ఏసీబబీ గుర్తించింది.


హైదరాబాద్: తెలంగాణ ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవీకారాణి అక్రమాస్తులపై ఏసీబీ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. అక్రమంగా సంపాదించిన డబ్బుతో దేవికారాణి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్టుగా ఏసీబబీ గుర్తించింది.

ఈ బంగారు ఆభరణాలను ప్రస్తుతం మాయమైపోయినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. హిమయత్ నగర్ లోని సీఎంజే జ్యూయలర్స్ దుకాణంలో రూ. 10 కోట్ల విలువైన ఆభరణాలను దేవికారాణి కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం ఈ బంగారు ఆభరణాలు ఆచూకీ కోసం ఏసీబీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

also read:తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో ట్విస్ట్: బిల్డర్ వద్ద రూ. 4 కోట్లు సీజ్

దేవికారాణి కుటుంబసభ్యులను ఈ బంగారు ఆభరణాల గురించి ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కమర్షియల్ ప్లాట్ నిర్మాణం కోసం దేవికారాణి ఓ బిల్డర్ కు రూ. 3.47 కోట్లను ఇచ్చింది. ఈ నెల 1వ తేదీన బిల్డర్ నుండి రూ.4 కోట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. అంతేకాదు  బిల్డర్ ను కూడ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

పక్క రాష్ట్రాల్లో కూడ దేవికారాణి పెట్టుబడులు పెట్టినట్టుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు.
 

click me!