కాంగ్రెస్‌కు మరో షాక్: టీఆర్ఎస్‌లోకి ఆనంద్ భాస్కర్

Published : Mar 22, 2019, 01:50 PM ISTUpdated : Mar 22, 2019, 03:54 PM IST
కాంగ్రెస్‌కు మరో షాక్: టీఆర్ఎస్‌లోకి ఆనంద్ భాస్కర్

సారాంశం

కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ రాపోల్ ఆనంద్ భాస్కర్ శుక్రవారం నాడు రాజీనామా చేశారు.త్వరలోనే ఆయన టీఆర్ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నట్టుగా  సమాచారం.


హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ రాపోల్ ఆనంద్ భాస్కర్ శుక్రవారం నాడు రాజీనామా చేశారు.త్వరలోనే ఆయన టీఆర్ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నట్టుగా  సమాచారం.

రాపోల్ ఆనంద్ భాస్కర్ కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడ దూరంగా ఉంటున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టుగా  ఆయన వర్గీయులు చెబుతున్నారు.రాజీనామా లేఖను  రాపోల్ ఆనంద్ భాస్కర్ రాహుల్ గాంధీకి పంపారు.

పార్టీకి ఎంత నిబద్దతతో పనిచేసినా తన పట్ల నిర్లక్ష్య వైఖరితోనే వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.పార్టీ విధేయులను మరిచి ఏకపక్షంగా వ్యవరిస్తున్నారని విమర్శించారు. రాహుల్ నాయకత్వంలో పార్టీ ఎదిగే సూచనలు కనిపించటంలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో ఎలక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్న తనను కావాలనే పక్కన పెట్టారన్నారు. అయినా పార్టీ కోసం సంస్థాగతగా కృషి చేసినట్లు రాపోలు ఆనంద భాస్కర్ వివరించారు.


 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే