మాజీ ఎమ్మెల్సీలకు ఊరట: నోటిఫికేషన్‌ విడుదలకు హైకోర్టు బ్రేకులు

Published : May 09, 2019, 04:39 PM IST
మాజీ ఎమ్మెల్సీలకు ఊరట: నోటిఫికేషన్‌ విడుదలకు హైకోర్టు బ్రేకులు

సారాంశం

 తమను అన్యాయంగా పదవి నుండి తొలగించారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు మాజీ ఎమ్మెల్సీకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 15వ తేదీ వరకు ఎన్నికల నోటీఫికేషన్‌ విడుదల చేయకూడదని హైకోర్టు ఆదేశించింది.


హైదరాబాద్: తమను అన్యాయంగా పదవి నుండి తొలగించారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు మాజీ ఎమ్మెల్సీకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 15వ తేదీ వరకు ఎన్నికల నోటీఫికేషన్‌ విడుదల చేయకూడదని హైకోర్టు ఆదేశించింది.

గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో  టీఆర్ఎస్‌ నుండి ముగ్గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు. భూపతిరెడ్డి, యాదవరెడ్డి, రాముల్ నాయక్‌లపై అనర్హత వేటు పడింది.

కనీసం తమ అభిప్రాయాలను కూడ పరిగణనలోకి తీసుకోకుండానే అనర్హత వేటు వేశారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్సీలు  భూపతి రెడ్డి, యాదవరెడ్డిలు హైకోర్టు‌ను ఆశ్రయించారు.

ఈ నెల 15వ తేదీ లోపుగా  ఎలాంటి ఎన్నికల నోటీఫికేషన్‌ను విడుదల చేయకూడదని హైకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ నెల 15వ తేదీన ఈ విషయమై మరోసారి కోర్టు విచారణ చేయనుంది. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్