కేంద్ర హోంశాఖ సహాయంతో ఎదుర్కొంటాం: తప్పుడు కేసులపై బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు

Published : Mar 24, 2022, 05:03 PM IST
కేంద్ర హోంశాఖ సహాయంతో ఎదుర్కొంటాం:  తప్పుడు కేసులపై బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు

సారాంశం

రాష్ట్రంలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై కేసీఆర్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు చెప్పారు. 


హైదరాబాద్:  రాష్ట్రంలో BJP కార్యకర్తలపై KCR సర్కార్ తప్పుడు కేసులు బనాయిస్తుందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆరోపించారు.

గురువారం నాడు Ramachandra Rao హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. Bodhan లో బీజేపీ నేతలపై 307 కేసులు పెట్టారన్నారు. తెలంగాణను బెంగాల్ గా మార్చొద్దని ఆయన కోరారు.కేంద్ర హోంశాఖ సహాయంతో  ఈ కేసులను ఎదుర్కొంటామన్నారు.

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌  రాత్రికి రాత్రే ఛత్రపతి Shivaji విగ్రహ ప్రతిష్ట వివాదానికి కారణమైంది.  ఈ విగ్రహ ఏర్పాటు రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. విగ్రహ ఏర్పాటును ఓ వర్గం  సమర్ధిస్తే మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో రెండు వర్గాల మధ్య నిరసనలతో ఉద్రిక్తతలు చోటు చేసుకొన్నాయి. ఈ నెల 20వ తేదీన పోలీసులు   ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. అంతేకాదు బాష్పవాయువును కూడా ప్రయోగించారు.144 సెక్షన్ ను కూడా విధించారు.

శివాజీ statue ఏర్పాటు వెనుక ఇద్దరు కీలకంగా వ్యవహరించారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశారు. శివాజీ విగ్రహం ఏర్పాటు కోసం మున్సిఫల్ సమావేశంలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గోప, శరత్ లు దీని వెనుక ఉన్నారనే ప్రచారం కూడా లేకపోలేదు.

బోధన్​లో శివాజీ విగ్రహ ఏర్పాటు విషయంలో మూడు రోజులుగా కొనసాగుతున్న వివాదం మంగళవారం నాడు సమసిపోయింది. శివాజీ విగ్రహ ఏర్పాటుపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఒక వర్గం స్పష్టం చేయడంతో ఉద్రిక్తత చల్లారింది. ఈ విషయమై ఇరువర్గాలపెద్దలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆర్డీఓ రాజేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన ఆఫీసులో రెండు మతాలకు చెందిన పెద్దలు, ఆల్​ పార్టీ లీడర్లు, కులపెద్దలతో ఏసీపీ  ఎన్.రామారావు  సమావేశం నిర్వహించారు.

ఎమ్మెల్యే Shakeel  వచ్చిన తర్వాత ఏ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలనే విషయంపై అన్ని వర్గాలకు చెందిన నాయకులు, మత పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇక నుంచి గొడవలు పడకుండా కలిసి ఉంటామని హామీ ఇచ్చారని ఆర్డీఓ తెలిపారు. సోషల్​ మీడియాలో కొంతమంది అనవసర పోస్టులు పెట్టి గందరగోళం సృష్టిస్తున్నారని వారిపై కేసులు నమోదు చేస్తామని  తెలిపారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Padma Awards 2026 : తెలంగాణకు 7, ఏపీకి 4 పద్మ అవార్డులు.. ఆ 11 మంది ఎవరంటే?
Nampally Fire Breaks Out: ఘటనా స్థలాన్ని పరిశీలించిన MLA రాజాసింగ్ | Asianet News Telugu