భవిష్యత్తులో తనకు బీజేపీ అండ కావాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ సీనియర్ నేత డాక్టర్ చంద్రశేఖర్ ను కోరారు.
హైదరాబాద్: భవిష్యత్తులో తనకు బీజేపీ అండ కావాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ సీనియర్ నేత డాక్టర్ చంద్రశేఖర్ ను కోరారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ నేత మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ తో భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా చంద్రశేఖర్ తో ఈటల రాజేందర్ చర్చించారు. బీజేపీలో చేరడానికి కూడ తాను వెనుకంజ వేయనని ఆయన చెప్పారు. డాక్టర్ చంద్రశేఖర్ సూచనలు సలహాలను తాను తప్పకుండా పాటిస్తానని ఈటల రాజేందర్ చెప్పారు.
also read:తప్పు చేశాడు, చట్టపరంగానే చర్యలు: ఈటల ఇష్యూపై కేబినెట్ లో కేసీఆర్
మంగళవారం నాడు సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కను ఈటల రాజేందర్ కలిశారు. బుదవారం నాడు రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ తో భేటీ అయ్యారు. వరుసగా పలువురు కీలక నేతలను ఈటల రాజేందర్ కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. మాసాయిపేట, హకీంపేటల్లో అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ ఆక్రమించుకొన్నారనే ఆరోపణలతో మంత్రివర్గం నుండి కేసీఆర్ తప్పించారు. మరోవైపు దేవరయంజాల్ గ్రామంలో శ్రీసీతారామస్వామి దేవాలయానికి చెందిన భూములను ఈటలతో పాటు ఆయన అనుచరులు కూడ ఆక్రమించుకొన్నారనే ఆరోపణలపై ఐఎఎస్‌లతో కమిటీని ఏర్పాటు చేశారు.