బోయిన్‌పల్లి కిడ్నాప్: ఏ1 గా భూమా అఖిలప్రియ, రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

Published : Jan 07, 2021, 02:23 PM IST
బోయిన్‌పల్లి కిడ్నాప్:  ఏ1 గా భూమా అఖిలప్రియ, రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

సారాంశం

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు.

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు.

హఫీజ్‌పేట భూముల విషయంలోనే ప్రవీణ్ రావు తో పాటు ఆయన సోదరులను నిందితులు కిడ్నాప్ చేశారు.  ఈ కిడ్నాప్ వ్యవహరంలో తొలుత టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు ఏ1గా చేర్చారు.  

ఏవీ సుబ్బారెడ్డిని విచారించి వదిలిన తర్వాత ఏ1 స్థానంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను చేర్చారు. ఏ2గా ఏవీ సుబ్బారెడ్డిని చేర్చారు. 

2016లో హఫీజ్ పేట సర్వేనెంబర్ 80లో 25 ఎకరాల భూముల విషయంలో  వివాదం తలెత్తిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

ప్రవీణ్ రావు సోదరులు ఏవీ సుబ్బారెడ్డికి డబ్బులిచ్చి ఈ వివాదాన్ని సెటిల్ చేసుకొన్నారు. ఇంకా 25 ఎకరాల భూమిని తమకు ఇవ్వాలని భూమా అఖిలప్రియ వర్గం ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా  పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

భూమా నాగిరెడ్డి బతికున్న కాలంలో ఈ భూమిని కొనుగోలు చేశారని భూమా అఖిలప్రియ వర్గం వాదిస్తోంది. తమ తండ్రి కొనుగోలు చేసిన భూమిలో తమకే వాటా దక్కాలని భూమా అఖిలప్రియ వాదిస్తోంది. 

also read:చంచల్‌గూడ జైల్లో భూమా అఖిలప్రియ: యూటీ నెంబర్ 1509 కేటాయింపు

తన వాటా కింద  డబ్బులు ఇవ్వాలని భూమా అఖిలప్రియ డిమాండ్ చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ భూమి తమదేనని ఏవీ సుబ్బారెడ్డి,భూమా అఖిలప్రియ, భార్గవ్ రామ్ లు వాదిస్తున్నారు. 

ఈ భూమి ధర పెరగడంతో  సమస్యలు ఎదురయ్యాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu