నేనే రంగంలోకి దిగుతా: సజ్జనార్‌కి ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్

Published : Jan 07, 2021, 01:10 PM IST
నేనే రంగంలోకి దిగుతా: సజ్జనార్‌కి ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్

సారాంశం

సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. గోవుల అక్రమ తరలింపును  అడ్డుకోకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని ఆయన హెచ్చరించారు.

హైదరాబాద్: సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. గోవుల అక్రమ తరలింపును  అడ్డుకోకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని ఆయన హెచ్చరించారు.

ప్రతి రోజూ 10 నుండి 15 ట్రక్కుల్లో ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు.బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ ముందు నుండి ఆవులను తరలిస్తున్న ఫోటోను రాజాసింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ట్విట్టర్ వేదికగా ఈ పోస్టును ఆయన పోస్టు చేశారు.

 

రాజకీయ నాయకులపై కామెంట్స్ చేయడం మాని.. గోవుల అక్రమ రవాణాను నిలిపివేయాలని ఆయన సీపీకి హితవు పలికారు. 

గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఆవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆయన కోరారు.

ఈ విషయంలో తెలంగాణ డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. 
 

PREV
click me!

Recommended Stories

Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్
Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !