కన్నీటి వీడ్కోలు: అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు

By narsimha lodeFirst Published Dec 5, 2021, 4:04 PM IST
Highlights

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు ఆదవారం నాడు పూర్తయ్యాయి. కొంపల్లిలోని ఆయన స్వంత ఫాం హౌస్ లో అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు ఆదివారం నాడు పూర్తయ్యాయి.  అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలను  నిర్వహించారు. కొంపల్లిలోని ఆయన స్వంత ఫాం హౌస్ లోనే Last rites నిర్వహించారు. రోశయ్యను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు, ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. శనివారం నాడు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణించాడు.Rosaiah మృతికి పలువురు సంతాపం తెలిపారు.  పలు పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, వీఐపీలు రోశయ్య బౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. సుధీర్ఘకాలం పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంతేకాదు పలువురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసినప్పటికీ ఆయన ఎక్కువగా ఆర్దిక శాఖను నిర్వహించారు. Congress పార్టీలో గ్రూప్ రాజకీయాలకు భిన్నంగా ఆయన వ్యవహరించారు. ఇతర పార్టీల్లోని నేతలతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. అందుకే ఆయనను అజాత శతృవు అని పిలుస్తారు. 

.రోశయ్య చాలా కాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ఆర్ధిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు వదులుకొన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రోశయ్యకు గవర్నర్ పదవిని అప్పగించింది. తమిళనాడు రాష్ట్రానికి రోశయ్య  గవర్నర్ గా కొనసాగారు. రోశయ్య కు  పలు పార్టీల ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి సహా పలువురు రోశయ్య  బౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. 

also read:గాంధీ భవన్ కు రోశయ్య పార్థీవ దేహం: నివాళులర్పించిన మల్లిఖార్జున ఖర్గే

గాంధీ భవన్ నుండి రోశయ్య డెడ్‌బాడీని కొంపల్లి ఫాంహౌస్ కు తరలించారు. ఈ ఫాంహౌస్ లోనే తన అంత్యక్రియలను నిర్వహించాలని రోశయ్య కుటుంబ సభ్యులకు చెబుతుండేవారని.. ఆయన కోరిక మేరకే ఈ ఫాం హౌస్ లో రోశయ్య అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ ఫాం‌హౌస్ కు వచ్చిన సమయంలో ఇక్కడ పనిచేసే వారితో రోశయ్య ఆప్యాయంగా పలకరించేవారు. ఫాం హౌస్ మొత్తం ఆయన కలయ తిరిగేవారు.  ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే వన భోజనాలను కూడా ఈ ఫాం హౌస్ లో ఆయన నిర్వహించేవారు. ఈ ఫాం హౌస్ లో  ఈ ఏడాది నిర్వహించిన వన భోజనాలకు రోశయ్య హాజరు కాలేదు. నడవలేని స్థితి కారణంగా ఆయన వన భోజనాలకు దూరంగా ఉన్నారు. అయితే గత ఏడాది నిర్వహించిన వన భోజనాలకు రోశయ్యహాజరయ్యారు. తెలంగాణ సీఎం సహా పలువురు మంత్రులు రోశయ్య  బౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. పలు పార్టీల నేతలు కూడా రోశయ్యను అజాత శతృవుగా పేర్కొన్నారు. 

 తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, తమిళనాడు గవర్నర్  ఆర్ఎన్ ర‌వి, సీఎం ఎంకే స్టాలిన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ సాకె శైలజనాథ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలంగాణ, ఏపీలకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. 


 

click me!