కాంగ్రెస్ లోకి మాజీ బీఆర్ఎస్ నేత శ్రీహరి రావు:తెలంగాణలో నిశ్శబ్దం రానుందన్న రేవంత్

By narsimha lode  |  First Published Jun 14, 2023, 3:19 PM IST


బీఆర్ఎస్ కు  రాజీనాామా  చేసిన  నిర్మల్ జిల్లాకు  చెందిన  బీఆర్ఎష్  సీనియర్ నేత  శ్రీహరి రావు  ఇవాళ  కాంగ్రెస్ లో  చేరారు.
 


నిర్మల్: బీఆర్ఎస్ కు  ఇటీవలనే  రాజీనామా  చేసిన  శ్రీహరిరావు బుధవారంనాడు  కాంగ్రెస్ లో  చేరారు.  ఈ నెల  12న   శ్రీహరిరావు  బీఆర్ఎస్ కు  రాజీనామా  చేశారు.  శ్రీహరిరావు  బీఆర్ఎస్ నాయకత్వం తీరుపై  అసంతృప్తితో  ఉన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం  తనకు  ఇచ్చిన హామీని అమలు  చేయలేదని  శ్రీహరిరావు అసంతృప్తితో  ఉన్నారు.  దీంతో  మూడు  రోజుల క్రితం  ఆయన బీఆర్ఎస్ కు  రాజీనామా  చేశారు.  ఇవాళ  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో  చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి  పార్టీలోకి శ్రీహరిరావును  ఆహ్వానించారు  రేవంత్ రెడ్డి .

తెలంగాణ ఉద్యమంలో  కేసీఆర్ తో కలిసి  శ్రీహరిరావు  పనిచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  అప్పటి టీఆర్ఎస్ బలోపేతం కోసం  పనిచేశారు.   బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన  తర్వాత  పదవుల విషయంలో  అన్యాయం  జరిగిందని శ్రీహరిరావు  చెప్పారు. తనతో పాటు తన అనుచరులకు  కూడ  పదవుల విషయంలో అన్యాయం జరిగిందని  శ్రీహరి రావు  మూడు  రోజుల క్రితం మీడియా సమావేశంలో తెలిపారు. 

Latest Videos

undefined

తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతుంది:రేవంత్ రెడ్డి 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  నిశ్శబ్ద విప్లవం, తుఫాన్  రానుందని  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నిర్మల్ లో  కాంగ్రెస్ జెండా ఎగురుతుందని  ఆయన   ధీమాను వ్యక్తం చేశారు.కొందరు పార్టీ వీడితే  నాయకులే  లేరన్నట్టుగా మాట్లాడాదరని పరోక్షంగా  మహేశ్వర్ రెడ్డి  గురించి వ్యాఖ్యలు  చేశారు. కాంగ్రెస్ లోకి  మహేశ్వర్ రెడ్డి  పేరు ప్రస్తావించకుండానే  అంతకంటే  బలమైన నాయకులే  పార్టీలోకి వచ్చారని  రేవంత్ రెడ్డి  తెలిపారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి  రేవంత్ రెడ్డి  సవాల్ విసరారు.  ఏ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లు కట్టించారో ఆ గ్రామానికి వెళ్లి ఓట్లు అడగాలన్నారు.  
ఇందిరమ్మ ఇల్లు కట్టిన చోట తాము  ఓట్లు అడుగుతామని  రేవంత్ రెడ్డి  చెప్పారు. ఈ సవాల్ కు  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సిద్దమా అని  ఆయన  ప్రశ్నించారు. 
 

click me!