పిస్తా హౌస్ కి షాక్.. ఆహారంలో బొద్దింకలు... భారీ జరిమానా

ramya Sridhar   | Asianet News
Published : Dec 13, 2019, 09:04 AM IST
పిస్తా హౌస్ కి షాక్.. ఆహారంలో బొద్దింకలు... భారీ జరిమానా

సారాంశం

 పిస్తాహౌస్‌లో బేకరీ ఉత్పత్తులను కొనేం దుకు వెళ్లగా ఆహార పదార్థాలపై బొద్దింకలు తిరుగు తుండడాన్ని గమనించానని ఆయన చెప్పారు. దాని పై అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా అక్కడి సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోగా, తనతోనే వాగ్వివా దానికి దిగారని ఆయన ఆరోపించారు. 

ప్రముఖ రెస్టారెంట్ పిస్తా హౌస్ కి భారీ షాక్ తగిలింది. పిస్తా హౌస్ కి అధికారులు భారీ జరిమానా విధించారు.  పూర్తి వివరాల్లోకి వెళితే... నిజాంపేట్‌ క్రాస్‌రోడ్డులోని పిస్తాహౌస్‌లో ఆహార పదార్థాలపై బొద్దింకలు సంచరిస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యా రని కేపీహెచ్‌బీ ఏడోఫేజ్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. 

గురువారం పిస్తాహౌస్‌లో బేకరీ ఉత్పత్తులను కొనేం దుకు వెళ్లగా ఆహార పదార్థాలపై బొద్దింకలు తిరుగు తుండడాన్ని గమనించానని ఆయన చెప్పారు. దాని పై అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా అక్కడి సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోగా, తనతోనే వాగ్వివా దానికి దిగారని ఆయన ఆరోపించారు. 

దీనిపై మూ సాపేట్‌ సర్కిల్‌ ఏఎంహెచ్‌వో డా.సంపత్‌కుమార్‌కు ఫోన్‌ చేసి విషయాన్ని చెప్పగా ఆయన వెంటనే సిబ్బందిని పంపించారన్నారు. వారు పిస్తాహౌస్‌ను సందర్శించి అక్కడ అపరిశుభ్రంగా ఉండడంతో రూ. 20వేల జరిమానా విధించారు.

 బొద్దింకల విషయాన్ని ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్‌చేసి చెప్పినా ఆయన నుంచి సరైన స్పందన రాలేదని బాధితుడి పేర్కొన్నాడు. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఎవరూ కూ డా పిస్తాహౌస్‌లో ఆహార పదార్థాలను కొనేందుకు ఇష్టపడ రని పేర్కొన్నాడు. పిస్తాహౌస్‌ నిర్వాహకు లపై చర్యలు తీసు కోవడంలో అధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నాడు.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu