తప్పిన ప్రమాదం: సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో మంటలు

By narsimha lodeFirst Published Nov 3, 2020, 3:44 PM IST
Highlights

మేడ్చల్ రైల్వేస్టేషన్ లో ఆగి ఉన్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి.  ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే శాఖ  తెలిపింది.


మేడ్చల్: మేడ్చల్ రైల్వేస్టేషన్ లో ఆగి ఉన్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి.  ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే శాఖ  తెలిపింది.

మంగళవారం నాడు మధ్యాహ్నం మేడ్చల్ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలులో మంటలు వ్యాపించిన విషయాన్ని గుర్తించిన సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

తొలుత ఒక బోగిలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత రెండో బోగికి మంటలు వ్యాపించాయి.
 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పుతున్నాయి.

రైలు చివరి బోగిలో ఆకస్మాత్తుగా మంటలు వచ్చాయి. ఈ బోగీలో ప్రయాణీకులెవరూ లేరు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ విషయం తెలిసిన వెంటనే రైల్వే శాఖాధికారులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. ఈ బోగీలో మంటలు ఎలా వ్యాపించాయనే విషయమై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో ఇదే తరహాలో బోగీల్లో మంటలు వ్యాపించి ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇవాళ ఘటనలో ఎలాంటి ప్రాణ నస్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు. 
 

click me!