అఫ్జల్‌గంజ్ టైర్ల గోడౌన్‌లో అగ్నిప్రమాదం: భారీగా ట్రాఫిక్ జామ్

Published : Apr 07, 2021, 12:37 PM ISTUpdated : Apr 07, 2021, 12:44 PM IST
అఫ్జల్‌గంజ్ టైర్ల గోడౌన్‌లో అగ్నిప్రమాదం: భారీగా ట్రాఫిక్ జామ్

సారాంశం

నగరంలోని అఫ్జల్ గంజ్ లోని టైర్ల గోదామ్ లో బుధవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ గోడౌన్ పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  

నగరంలోని అఫ్జల్ గంజ్ లోని టైర్ల గోదామ్ లో బుధవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ గోడౌన్ పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

టైర్ల గోడౌన్లో అగ్నిప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మంటలను ఆర్పేందుకు  15 ఫైరింజన్లను రంగంలోకి దించారు.15 ఫైరింజన్లు  మంటలను ఆర్పుతున్నాయి.ఈ అగ్నిప్రమాదం కారణంగా నగరంలోని  చాదర్‌ఘాట్-అఫ్జల్ గంజ్ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ గోడౌన్లో వందల టైర్లు ఉన్నాయి. అసలే వేసవి కాలం కావడంతో పాటు టైర్లు మంటలకు ఆహుతి అయ్యాయి. దీంతో మంటలు ఆర్పేందుకు  ఫైర్ ఫైటర్స్ ఇబ్బందిపడుతున్నారు.ఈ గోడౌన్లలో  మంటలు ఎలా వ్యాపించాయనే దానిపై  అధికారులు ఆరా తీస్తున్నారు. నగరంలో గతంలో కూడ టైర్ల గోడౌన్లలో కూడ  మంటలు వ్యాపించిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?