గ్యాస్ సిలిండర్ పేలుడుతో భారీ అగ్ని ప్రమాదం

Published : Oct 15, 2019, 12:14 PM IST
గ్యాస్ సిలిండర్ పేలుడుతో భారీ అగ్ని ప్రమాదం

సారాంశం

మేడ్చల్ జిల్లా రాజబొల్లారం తండాలో మంగళవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. 

మేడ్చల్: మేడ్చల్ మండలం రాజ బొల్లారం తండాలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొందని  స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక బృందం  సంఘటన స్థలానికి చేరుకొని  మంటలను ఆర్పుతున్నారు.  

ఈ ఘటనలో ఓ చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. భారీగా మంటలు ఎగిసి పడుతుండడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

గ్యాస్ సిలిండర్ ఎలా పేలిందనే విషయమై పోలీసులు  ఆరా తీస్తున్నారు. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిందా ఇతరత్రా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భారీగా  మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయంతో పరుగులు పెడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్