సంజీవయ్య పార్క్ వద్ద అగ్ని ప్రమాదం

Published : May 15, 2019, 02:46 PM IST
సంజీవయ్య పార్క్ వద్ద అగ్ని ప్రమాదం

సారాంశం

హైదరాబాద్ నగరంలోని సంజీవయ్య పార్క వద్ద బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. పార్క్ వద్ద ఉన్న నర్సరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

హైదరాబాద్ నగరంలోని సంజీవయ్య పార్క వద్ద బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. పార్క్ వద్ద ఉన్న నర్సరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో చాలా మొక్కలు కాలి బూడిదయ్యాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క ఫైర్ ఇంజినే రావడంతో.. మంటలు ఆర్పడం కష్టంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు