రూ.100 కోట్లకుపైగా ఆస్తులు: మెదక్ అడిషనల్ కలెక్టర్‌ నగేశ్‌పై కేసు

By Siva KodatiFirst Published Oct 4, 2020, 8:27 PM IST
Highlights

మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్‌పై మరో కేసు నమోదైంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి వున్నాడన్న అభియోగంపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కోటి 20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కన నగేశ్ వ్యవహారంపై ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు చేసింది

మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్‌పై మరో కేసు నమోదైంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి వున్నాడన్న అభియోగంపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

కోటి 20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కన నగేశ్ వ్యవహారంపై ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు చేసింది. ఈ క్రమంలో రూ.100 కోట్లకు పైచిలుకు అక్రమాస్తులు బయటపడ్డాయి. హైదరాబాద్, మెదక్, రంగారెడ్డిలో భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. 

మెదక్ జిల్లాలోని చిప్పల్‌తుర్తిలో 112 ఎకరాల భూమికి ఎన్ఓసీ‌ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేశాడు అడిషనల్ కలెక్టర్ నగేష్. ఈ విషయంలో రూ. 40 లక్షలు లంచం తీసుకొంటూ నగేష్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. 

ఈ కేసులో ఏసీబీ అధికారుల విచారణలో మరో ముగ్గురు రెవిన్యూ అధికారులు సహా నగేష్ బినామీ పాత్రను గుర్తించారు. సుమారు 12 గంటల విచారణ తర్వాత ఈ నెల 9వ తేదీన అడిషనల్ కలెక్టర్ నగేష్ సహా ముగ్గురు రెవిన్యూ అధికారులు, నగేష్ బినామీ జీవన్ గౌడ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఇంకా సమగ్ర దర్యాప్తు చేసేందుకుగాను కస్టడీని కోరుతూ కోర్టులో ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ నెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఐదుగురు నిందితులను కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఆదేశాల మేరకు జైలు నుండి నిందితులను ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకొంటారు. ఏసీబీ కేసులో చిక్కుకొన్న మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ సహా మరో ముగ్గురు రెవిన్యూ అధికారులను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

click me!