ఖైరతాబాద్ వినాయకుడ్ని దర్శించుకున్న ఈటల దంపతులు

By Arun Kumar PFirst Published Sep 13, 2018, 8:10 PM IST
Highlights

వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఖైరతాబాద్ లో వెలిసిన భారీ వినాయకుడికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబంతో కలిసి ఖైరతాబాద్ వినాయకున్ని దర్శించుకున్నారు ఈటల. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవకమిటీ సభ్యులు మంత్రిని శాలువాతో సన్మానించారు. 

లంబోదరుడి దర్శనం అనంతరం మంత్రి మాట్లాడుతూ... రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూడాలని దేవున్ని కోరుకున్నట్లు తెలిపారు. దేశంలోనే అత్యంత సుందరమైన హైదరాబాద్ నగరానికి ఈ వినాయక చవితి ఉత్సవాలు మరింత శోభ తీసుకువచ్చాయని అన్నారు. ఈ నాలుగేళ్ళ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ది చెందిందని పేర్కొన్నారు. 

లౌకికత్వం వెల్లివిరిసే నగరంగా హైదరాబాద్ మంచి పేరుందని ఈటల అన్నారు. ఇలాగే మతాలకతీతంగా అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాని మరింతగా అభివృద్ది పథంలోకి తీసుకెళ్లాని సూచించారు.

 వినాయక చవితి పండగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి భవన్ లో ఏర్పాటుచేసిన వినాయకుడికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. 
 
click me!