సబిత ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డికి అహ్మద్ పటేల్ బంపర్ ఆఫర్

By narsimha lodeFirst Published Nov 23, 2018, 3:55 PM IST
Highlights

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  తనయుడు  కార్తీక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేత అహ్మద్‌పటేల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.


హైదరాబాద్:  మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  తనయుడు  కార్తీక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేత అహ్మద్‌పటేల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.  ఈ ఆఫర్ మేరకు కార్తీక్ రెడ్డి  తిరిగి తన రాజీనామాను ఉపసంహరించుకొనే అవకాశం ఉంది. 

 మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి  రాజేంద్రనగర్  అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేయాలని భావించారు.  దాదాపుగా  రెండేళ్లుగా రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం నుండి  పోటీకి సన్నాహాలు చేసుకొన్నారు.  కానీ, తెలంగాణ రాష్ట్రంలో  టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు గాను కూటమిగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు ఏర్పడ్డాయి.

ఈ కూటమిలోని పార్టీల మధ్య  పొత్తు కారణంగా  రాజేంద్రనగర్ సీటు టీడీపీకి కేటాయించింది కాంగ్రెస్. గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా  పోటీ చేసిన ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ప్రకాష్ గౌడ్ టీడీపీని వీడీ టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో ఆ దఫా టీడీపీ ఈ స్థానం నుండి గణేష్‌ గుప్తాను బరిలోకి దింపింది.

రాజేంద్రనగర్ నుండి పోటీ చేసేందుకు  ఆసక్తిగా ఉన్న కార్తీక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది.ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో  కాంగ్రెస్ పార్టీకి కార్తీక్ రెడ్డి రాజీనామా చేశారు.

రెబెల్స్ ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రంగంలోకి  దిగారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల చొరవతో రెబెల్స్ నామినేషన్లను ఉపసంహరించుకొన్నారు. మరోవైపు కార్తీక్ రెడ్డి తో  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అహ్మద్ పటేల్ చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో  చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుండి  కార్తీక్ రెడ్డికి పోటీ చేసే  అవకాశం కల్పిస్తామని  అహ్మద్ పటేల్ హామీ ఇచ్చారు.దీంతో కార్తీక్ రెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకొనే ఛాన్స్ ఉంది.

సంబంధిత వార్తలు

రాజేంద్రనగర్: గురుశిష్యుల మధ్య హోరాహోరీ

శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు
 

click me!